2024 లక్ష్యంగా జగన్ దూకుడు.. ఆ నియోజకవర్గాలే ప్రధాన టార్గెట్ !
2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధిని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడు. నిజానికి ఏపీ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి ఉన్న కానీ వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని ప్రజా సంక్షేమం కోసమే జగన్ ఖర్చుపెడుతున్నాడు. దీని వెనుక మరో బలమైన కోణం ఉన్నట్లు తెలుస్తుంది. అదే 2024 ఎన్నికలు ప్రజాపాలనే ఎన్నికల మంత్రం 2015 లో ఒక మోస్తరుగా గెలుపు రుచి చుసిన జగన్, 2019 కి […]
2019 లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధిని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడు. నిజానికి ఏపీ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయి ఉన్న కానీ వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని ప్రజా సంక్షేమం కోసమే జగన్ ఖర్చుపెడుతున్నాడు. దీని వెనుక మరో బలమైన కోణం ఉన్నట్లు తెలుస్తుంది. అదే 2024 ఎన్నికలు
ప్రజాపాలనే ఎన్నికల మంత్రం
2015 లో ఒక మోస్తరుగా గెలుపు రుచి చుసిన జగన్, 2019 కి వచ్చేసరికి ఎవరు ఊహించలేని విజయాన్ని నమోదు చేశాడు. దానికి ప్రధాన కారణం పాదయాత్ర అని అందరికి తెలుసు, సీఎం జగన్ కూడా దానినే నమ్ముతున్నాడు. అయితే 2024 కి వచ్చేసరికి తన పాలన ద్వారానే మరోసారి విజయం సాధించాలని బలంగా భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సృష్టంగా తెలుస్తుంది.
ఈ సారి సౌండ్ మరింత పెరగాలి
2019 లో టీడీపీని చావుదెబ్బ కొట్టిన జగన్, 2024 లో మరోసారి అంతకంటే గట్టి దెబ్బ కొట్టాలని రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ 23 చోట్ల జెండా ఎగరవేసింది. అయితే ఈసారి వాటిలో కూడా వైసీపీ జెండా ఎగరాలని జగన్ మోహన్ రెడ్డి భావించి అందుకు తగ్గట్లు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట డైరెక్ట్ గా నిధులు వాళ్ళకి ఇవ్వకుండా, అక్కడి వైసీపీ ఇంచార్జి కి ఎక్కువ పవర్స్ ఇచ్చి, స్థానికంగా అతను పట్టు పెంచుకునేలా చేయటం. దాని ద్వారా వైసీపీ మీద సానుభూతి, అభిమానం పెరిగేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
ఆ నియోజకవర్గాలే టార్గెట్
మనం పైన చెప్పుకున్నట్లు ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్న 23 నియోకజవర్గాలను వైసీపీ టార్గెట్ చేసింది. అదే సమయంలో టీడీపీ కంచుకోట లాంటి జిల్లాల్లో మరింత పట్టు పెంచుకోవటానికి సిద్ధం అవుతుంది. ముఖ్యంగా అనంతపురం, ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాలో వైసీపీని బలోపేతం చేయటానికి జగన్ సర్వ శక్తులు ఒడ్డుతున్నట్లు సమాచారం. ఇంకా ఎన్నికలకు రెండు మూడేళ్లు సమయం ఉన్నకాని ఇప్పటి నుండే కార్యాచరణ మొదలెట్టి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న జగన్ కు అవి ఎంత వరకు కలిసివస్తాయి అనేది చూడాలి