Chandrababu Naidu : మహానాడు వేదికపై మహిళలకు శుభవార్త తెలిపిన చంద్రబాబు
ప్రధానాంశాలు:
Chandrababu Naidu : మహానాడు వేదికపై మహిళలకు శుభవార్త తెలిపిన చంద్రబాబు
Chandrababu Naidu : 2025 మహానాడు సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమంపై పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యంగా ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థిక భారం లేకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించగలగడం సాధ్యమవుతుంది. ఇది మహిళలకు స్వేచ్ఛతో పాటు ఉద్యోగం, విద్య, ఆరోగ్య సేవలకు సులభమైన ప్రాప్తిని కలిగించనుంది.

Chandrababu Naidu : మహానాడు వేదికపై మహిళలకు శుభవార్త తెలిపిన చంద్రబాబు
Chandrababu Naidu : ఎంతోకాలంగా మహిళలు ఎదురుచూస్తున్న ఎదురుచూపులు తెరదించిన చంద్రబాబు
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తోందని గుర్తు చేశారు. ఇది గృహిణులకు ఆర్థిక ఊతమివ్వడమే కాక, వంట పనిలో ఉపయోగపడే వనరులను ఉచితంగా అందించడంలో అద్భుతమైన చర్యగా అభివర్ణించారు. ఈ చర్యలన్నీ మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి నిత్యజీవితాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా చేపట్టినవని ఆయన తెలిపారు.
“మగవారి కంటే ఎక్కువగా మా ఆడబిడ్డలను చూసే రోజు తొందరలోనే వస్తుంది” అని చంద్రబాబు పేర్కొంటూ, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళలు పురుషులతో సమానంగా ఉండే సమాజం ఏర్పడాలన్నదే తన సంకల్పమని , మహిళలు భయంతో కాదు, గౌరవంతో బతికే సమాజాన్ని నిర్మించాలన్నదే తన లక్ష్యమని స్పష్టంగా తెలిపారు. మహిళల అభివృద్ధికి, సమాన హక్కులకు ఆయన తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.