Allu Arjun Lawyer : అల్లు అర్జున్‌కి బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరు.. ఆయన గంటకు ఎంత తీసుకున్నారంటే….!
ప్రధానాంశాలు:
Allu Arjun Lawyer : అల్లు అర్జున్‌కి బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరు.. ఆయన గంటకు ఎంత తీసుకున్నారంటే....!
Allu Arjun Lawyer : డిసెంబర్ 4 న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టు, రిమాండ్, అనంతరం మధ్యంతర బెయిల్‌తో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చిక్కడపల్లి పోలీసులు ఆయనను శుక్రవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి, వాంగ్మూలం, వైద్యపరీక్షల అనంతరం నాంపల్లి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించటంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. జైలు గేటు వద్ద అల్లు అర్జున్ ఏఆర్ సిబ్బందితో గొడవ పడినట్టు సమాచారం. జైల్లో ఆయనకు మంజీరా బ్యారక్ కేటాయించారు.
Allu Arjun Lawyer ఎలా కుదిరింది..
నిరంజన్ రెడ్డిది చాలా ప్రత్యేకమైన నేపథ్యమని చెప్పొచ్చు. ఆయన లాయరే కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు చిరంజీవి నటించిన ఆచార్య కూడా ఉండటం విశేషం. 2011లో వచ్చిన గగనం మూవీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత క్షణం, ఘాజీ, వైల్డ్ డాగ్, ఆచార్యలాంటి సినిమాలను నిర్మించారు. వీటిలో గగనం, క్షణం, ఘాజీ హిట్టయినా.. వైల్డ్ డాగ్, ఆచార్య సినిమాలు దారుణంగా బోల్తా కొట్టాయి. 2022లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. అల్లు అర్జున్‌కు బెయిల్ రావడం వెనుక లాయర్ సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి పాత్ర ఎంతో ఉంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ “రయీస్” సినిమా ప్రమోషన్లలో భాగంగా జరిగిన తొక్కిసలాట ఘటనను గుర్తు చేసిన లాయర్ నిరంజన్ రెడ్డి.. అల్లు అర్జున్‌కు కోర్టు బెయిల్ ఇవ్వడంలో కీలక వాదనలు వినిపించారు.
సీనియర్ లాయర్ అయిన సిర్గాపూర్ నిరంజన్ రెడ్డి.. గంటకు రూ.5 లక్షలు వసూలు చేస్తారనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేలా నిరంజన్ రెడ్డి తన అనుభవాన్నంతా ఉపయోగించి వాదించారు. ఆయన వాదనలు ఫలించి.. బన్నీ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ మధ్యంతర బెయిల్ నాలుగు వారాల పాటు ఉండనుంది. ఈ సమయంలో అల్లు అర్జున్ దేశం విడిచి వెళ్లొద్దన్న షరతు విధించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.. తనకు ఉన్న పొలిటికల్ పరిచయాలతో తన పార్టీకి చెందిన నిరంజన్ రెడ్డికి కేసు అప్పగించినట్లు సమాచారం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ అప్పట్లో ప్రచారం నిర్వహించారు.