
America : ట్రంప్ బుద్ది ఏంటో మరోసారి భారతీయులకు తెలిసి వచ్చింది..!
America : ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో భారత్‌కు ఒక స్పష్టమైన సందేశం అందింది. ప్రపంచం భావోద్వేగాలతో కాకుండా వ్యూహాత్మక లాభనష్టాల దృష్టితో పనిచేస్తోంది అని. భారత్ వంటి శాంతిని కోరే దేశం కూడా ఇప్పుడు నిజమైన మిత్రులను ఎంచుకునే విషయంలో ఎక్కువ ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాటలతో పాక్‌ను భారత్‌తో సమానంగా చూస్తూ, మితవాద దేశాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఒకే మూడులో ఉంచడం భారతీయుల మనసుకు బాధ కలిగించే అంశం. ఇది తమ ప్రయోజనాలను కాపాడుకోవడంలో మాత్రమే ఆసక్తి ఉన్న దేశాల బహిరంగ నైజాన్ని ఆవిష్కరిస్తోంది.
America : ట్రంప్ బుద్ది ఏంటో మరోసారి భారతీయులకు తెలిసి వచ్చింది..!
అసలు పాకిస్తాన్‌కు అమెరికా ఎందుకు మద్దతు ఇస్తోంది? అని చూస్తే, దానికి ప్రధాన కారణం చైనాతో ఉన్న సంబంధమే. చైనా ఈ ప్రాంతంలో వ్యూహాత్మకంగా బలమైన శక్తిగా ఎదగడంతో, పాక్‌ను వదలకుండా అమెరికా ముందుకు తీసుకెళుతోంది. ఈ క్రమంలో భారత్‌ను నిజమైన మిత్రుడిగా కాకుండా, వాణిజ్య భాగస్వామిగా మాత్రమే చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. అవసరమైనప్పుడు వాణిజ్య ఒప్పందాలను కూడా విరమించేస్తామని హెచ్చరికలు చేయడం, వారి ఆలోచనలో మిత్రత్వానికి మించిన లాభం ముఖ్యమని నిరూపిస్తుంది. ఇది భారతీయులకు సరికొత్త హెచ్చరిక.
ఈ పరిస్థితుల్లో భారత్ తన అభివృద్ధిని ఇతరులపై ఆధారపడకుండా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాపై పూర్తిగా ఆధారపడే ధోరణిని తగ్గించి, స్వావలంబనను పెంచుకోవాలి. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం వంటి కీలక అంశాల్లో ఇతరులపై ఆశపడకుండా, భారతదేశం తన శక్తులను మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. “శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. శాశ్వతంగా ఉండేది దేశ ప్రయోజనం మాత్రమే” అనే మాటను గుండె లోతుల్లో పెట్టుకొని, ప్రతి భారతీయుడు సమర్థవంతంగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.