Ambati Rambabu : మైకు ముందు మాత్రమే అనిత.. తెర వెనక నడిపించేది అంత నారా లోకేష్: అంబటి
Ambati Rambabu : ఏపీ రాజకీయాలు ఇంకా రసవత్తరంగానే సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రచ్చ లేపుతున్నారు.వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తాజాగా సీఎం చంద్రబాబుపై (Chandrababu) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ రౌడీ, సైకో అంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. (Chandrababu) చంద్రబాబు గతంలో అనేక హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేదని, ఆయనకు చీటర్ అనే బిరుదు సరిపోతుందంటూ వ్యాఖ్యానించారు.
Ambati Rambabu : అలా అనేశాడేంటి?
ఇక రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని, అయితే పోలీసులు వాటిపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు .వైసీపీ (YCP)అధికారంలోకి వస్తే పోలీసులను బట్టలు ఊడదీసి నిలబెడతాం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మా నేతలను బెదిరించి, భయపెట్టే వారికి పోస్టింగ్ లు ఉంటాయి.

Ambati Rambabu : మైకు ముందు మాత్రమే అనిత.. తెర వెనక నడిపించేది అంత నారా లోకేష్: అంబటి
మేం ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయరు కాని మీ వాళ్లకి మాత్రం కొత్త రూల్స్ పుట్టుకొస్తాయి. ఎస్ఐను కూడా ట్రాన్స్ ఫర్ చేయించే పవర్ కూడా అనితకు లేదూ. ఇది నిజం. అనిత మైకు ముందే హోం మంత్రి.. తెర వెనుక నడిపించేది అంతా నారా లోకేష్ (Nara Lokesh) అంటూ అంబటి రాంబాబు (Ambati Rambabu) సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం అంబటి చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.