Adabidda Nidhi Scheme : ఆడబిడ్డ నిధితో 1500 ఖాతాలోకి.. ఏపీ ప్రభుత్వం శుభవార్త..!
ప్రధానాంశాలు:
Adabidda Nidhi Scheme : ఆడబిడ్డ నిధితో 1500 ఖాతాలోకి.. ఏపీ ప్రభుత్వం శుభవార్త..!
Adabidda Nidhi Scheme : ఏపీ ప్రభువం నుంచి ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆర్ధిక సహాయం ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. నెల వారిగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి 1500 రూపాయలు జమ చేస్తారు. ఈ ఆడబిడ్డ నిధికి మహిళలు 18 నుంచి 59 మధ్య వయసు గల వారు అర్హులు. అవసరమైన నెల వారి ఆర్హిక సహయాన్ని అందించేలా ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఆంధ్ర ప్రదేష్ మహిళలు అంతా కూడా ఈ పథకానికి మద్ధతి ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజుల అయిన సందర్భంగా సంకీర్ణ ప్రభుత్వం 100 రోజుల వేడుకలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పపాడు మండలంలో ప్రజావాణి కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం నిర్వహించారు. ఆరు రోజులు జరిగే ఈ ఈవెంట్ లో భవిష్యత్తు ప్రణాళికలు సహా ప్రభుత్వం సాధించిన విజయాలను కవర్ చేస్తారు.
Adabidda Nidhi Scheme ఆడబిడ్డ నిధి అమలు దిశగా..
ఆడబిడ్డ నిధి అమలు దిశగా పురోగతి కనిపిస్తుంది. ఈమధ్యనే ఈ పథకం గురించి ప్రారంభ అప్డేట్స్ ను వేగవంతం చేయాలని ప్రభుత్వం నుంచి మాగదర్శకాలు ఆదేశించారు. సిసైటీ ఫర్ ఎలిమ్నేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ఫ్) ఆధ్వరుయంలో సీఎం చంద్రబాబు నాయుడు పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై దృష్టి సారించాలని అన్నారు. ఆడబిడ్డ నిధి పథకానికి కూడా వివరణాత్మక మారదర్శకాలు ఇవ్వాలని చెప్పారు.
ఇప్పటికే ఏపీలో దీపావళి నుంచి అర్హులైన కుటుంబాలకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. పండగ తర్వాత ఆడబిడ్డ నిధి పథకం గురించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఆడబిడ్డ నిధి పథకంలో మహిళల ఆదాయ ప్రమాణాల మీద పనిచేస్తున్నారు. కేవలం బలహీన వర్గాల మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ పథకం వారికి అందించేలా సమీక్షలు చేస్తున్నారు. అర్హత ఉన్న మహిళలు తమ ఖాతాల్లో నెలకు 1500 రూపాయలు అందుకుంటారు.