AP IPL Team : ఏపీ cm వైఎస్ జగన్ సంచలన నిర్ణయం – ఏపీ నుంచి IPL టీం !
AP IPL Team : ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. రైతులకు, మహిళలకు, పేదలకు, బడుగు, బలహీన వర్గాలను ఆదుకున్నట్టే.. ఏపీలో క్రీడలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే.. క్రీడా శాఖపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఏపీలో క్రికెట్ తో పాటు ఇతర క్రీడలను కూడా ప్రోత్సహించాలని.. దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులతో చర్చించారు. క్రీడలను ప్రోత్సహించడం కోసం ఏపీలో ఆంధ్రా పేరుతో ఒక కొత్త టోర్నీని ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఆడుదాం ఆంధ్రా అనే పేరుతోనే ఏపీ మొత్తం క్రీడా సంబురాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామం, వార్డు, మండలం, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో క్రీడలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. క్రికెట్ తో పాటు బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో లాంటి పోటీలు కూడా నిర్వహిస్తారు. ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఇండోర్ గేమ్స్ తో పాటు మారథాన్, యోగా లాంటివి కూడా నిర్వహిస్తారు.
AP IPL Team : 46 రోజుల పాటు ఆటల నిర్వహణ
ఈ మ్యాచ్ లలో భాగంగా 46 రోజుల పాటు ఆటలను నిర్వహిస్తారు. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీ గ్రౌండ్స్, ఇంకా మున్సిపల్ స్టేడియం, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూనివర్సిటీ గ్రౌండ్స్ అన్ని మైదానాల్లో ఈ ఆటలపోటీలను ప్రభుత్వం నిర్వహించనుంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ ఆటల పోటీలను నిర్వహిస్తారు. అయితే.. క్రికెట్ లాంటి ఆట విషయంతో ఐపీఎల్ 2023 విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ మార్గదర్శనం చేస్తుందని సీఎం జగన్ స్పష్టం చేవారు. అంటే.. సీఎస్కే జట్టు సాయంతో ఏపీలో క్రికెట్ ఆటను విస్తృతం చేయనున్నారు. అలాగే.. భవిష్యత్తులో ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్ టీమ్ ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు.