Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500 | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

 Authored By ramu | The Telugu News | Updated on :18 September 2024,6:10 pm

ప్రధానాంశాలు:

  •  Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

Ap Womens  : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అమ‌లులోకి వ‌చ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వ‌డివ‌డిగా అడుగులు వేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ భేటీ కొనసాగుతుండ‌గా, ఈ భేటిలో ప‌లు అంశాల‌పై కీల‌క‌మైన చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. నూతన మద్యం విధానం, వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఆడబిడ్డ నిధి పథకంపై చర్చ జరిగింది. పలు ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ‌పరిశ్రమలకు భూముల కేటాయింపులపై కేబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. ఆడ‌బిడ్డ నిథి ప‌థ‌కం గురించి కూడా కేబినేట్‌లో చ‌ర్చ న‌డుస్తుంది.

Ap Womens  ఆడబిడ్డ నిధి పథకం..

18 నుంచి 59 సంవత్సరాల్లోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికలలో కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపైనా చర్చ జరుగనుంది. గతంలో ఈ మొత్తం 3 లక్షలు గా మాత్రమే ఉండేది. అలాగే పేదరికం లేని సమాజం నిర్మించాడంలో భాగంగా పీ 4 పైనా ఈరోజు కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.అలాగే పెండింగులో ఉన్న నీరు – చెట్టు బిల్లులకు నిధుల విడుదలపై మంత్రి వర్గం చర్చించనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, గేట్లు, కరకట్టల పటిష్టతకు ఎమర్జెన్సీ ఫండ్ కింద రూ. 300 కోట్లు విడుదలపై చర్చ జరుగనుంది.

Ap Womens మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్ వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ1500

Ap Womens : మ‌హిళ‌ల‌కి గుడ్ న్యూస్.. వారి ఖాతాల‌లోకి ఏకంగా రూ.1500

బుడమేరు ముంపు, వరద సాయంపై మంత్రివర్గం చర్చించనుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై చర్చించే అవకాశం ఉంది. మద్యం పాలసీపై కెబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లపై మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ఇసుక పాలసీ అమలు వంటి వాటిపైనా కేబినెట్‌లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.ప్రాథమికంగా కొన్ని అంశాలు తెరపైకి వచ్చాయి.. 18 ఏళ్లు వయసు దాటి ఉండాలని.. 59 సంవత్సరాల వరకు మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి నిధులు జమ చేస్తారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్థికంగా కొంత భరోసా నింపే దిశగా.. ప్రతి నెలా లబ్ధిదారులకు రూ.1500 చొప్పున డీబీటీ మోడ్ ద్వారా నేరుగా వారి ఖాతాకు డబ్బుల్ని జమ చేస్తారు. మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపై కూడా కేబినెట్ చర్చించింది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది