Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీలో కోట్ల మౌనం.. పార్టీపై అసంతృప్తితో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ?
ప్రధానాంశాలు:
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీలో కోట్ల మౌనం.. పార్టీపై అసంతృప్తితో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ?
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, అధినాయకత్వాన్ని కలిసే ప్రయత్నం కూడా చేయడం లేదన్న సమాచారం డోన్ నియోజకవర్గంతో పాటు కర్నూలు జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. దీంతో కోట్ల మౌనం వెనుక కారణాలేమిటన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా, కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యత తెలిసిందే. ఎన్నికల ముందు వరకు చురుగ్గా ప్రచారం చేసిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం రాజకీయంగా కొంత నిరాశకు గురైనట్లు కనిపిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరు తగ్గించడంతో పాటు, ప్రజా కార్యక్రమాల్లో కూడా అరుదుగా కనిపిస్తున్నారు.
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీలో కోట్ల మౌనం.. పార్టీపై అసంతృప్తితో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ?
Kotla Jayasurya Prakasha Reddy : ఏం జరుగుతుంది ?
2024 ఎన్నికలకు ముందు తన కుటుంబంతో కలిసి టీడీపీ లో చేరిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, సుదీర్ఘకాలంగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదన్న భావనతో పాటు, వైసీపీలోకి వెళ్లేందుకు ఆసక్తి లేకపోవడమే టీడీపీలో చేరడానికి కారణమని అప్పట్లో ఆయన వర్గాలు వెల్లడించాయి. ఆయన రాకతో కర్నూలు జిల్లాలో టీడీపీకి అదనపు బలం చేకూరిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది.అయితే ఎమ్మెల్యే టికెట్‌ను ఆయన పెద్దగా ఆసక్తితో స్వీకరించలేదని, గెలిచిన తర్వాత మంత్రి పదవి లభిస్తుందన్న ఆశతో ఉన్నారని టాక్. కానీ తనకంటే రాజకీయ అనుభవం తక్కువగా భావించే టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డిలకు మంత్రి పదవులు దక్కడం ఆయనకు తీవ్ర అసంతృప్తిని కలిగించిందని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే ఆయన మౌనానికి కారణమని కొందరు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలనే నిర్ణయానికి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి వచ్చినట్లు సమాచారం. అవసరమైతే తన సతీమణిని రాజకీయాల్లో కొనసాగించాలని, తాను మాత్రం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితుల వద్ద పలుమార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇకపై తాను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని కుటుంబ సభ్యులు, సన్నిహితులకు కూడా చెప్పినట్లు సమాచారం.ప్రస్తుతం డోన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, అక్కడికే పరిమితమవుతూ, భవిష్యత్తులో ఎన్నికల బరిలో దిగే అవకాశం లేదని కూడా ఆయన వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాలు ఇక తనకు సరిపోవని భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో కోట్ల మౌనం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తుండగా, ఆయన తుది నిర్ణయం ఏంటన్నది వేచి చూడాల్సిందే.