Venu Swamy : గుడివాడ అమర్నాథ్ గెలవడం కష్టమే… వేణు స్వామి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Venu Swamy : గుడివాడ అమర్నాథ్ గెలవడం కష్టమే… వేణు స్వామి…!

 Authored By ramu | The Telugu News | Updated on :16 April 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Venu Swamy : గుడివాడ అమర్నాథ్ గెలవడం కష్టమే... వేణు స్వామి...!

Venu Swamy  : ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు నువ్వా నేనా అని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో పోటీీ పడుతుంటే మరోవైపు రాజకీయ నాయకుల భవిష్యత్తును బయటపెడుతూ జ్యోతిష్య పండితులు వేణు స్వామి సంచలనం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎవరు గెలుస్తారు అనే విషయాలను బయటపెట్టిన వేణు స్వామి తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు స్వామి…వైసీపీ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతల గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే యాంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి జగన్ వైపు దూసుకొస్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ గారు విజయం సాధిస్తారని మీరు చెబుతున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో సర్వేలు మాత్రం పరిణామాలు వేరే లాగా ఉన్నాయని చెబుతున్నాయి.

Venu Swamy గుడివాడ అమర్నాథ్ గెలవడం కష్టమే వేణు స్వామి

Venu Swamy : గుడివాడ అమర్నాథ్ గెలవడం కష్టమే… వేణు స్వామి…!

Venu Swamy  : సర్వేలను నమ్మితే నేను జ్యోతిష్యుడుని ఎలా అవుతా…

దీనికి మీరు ఏమంటారు అని అడుగగా… దానికి వేణు స్వామి సమాధానం ఇస్తూ వాటన్నింటిని నేను పట్టించుకోనని తెలియజేశారు.  వాటిని చూసి నమ్మితే నేను కూడా రివ్యూ ఇచ్చేవాడిని అవుతా లేకపోతే పొలిటికల్ ఎనలిస్ట్ అవుతా కాని జ్యోతిష్యడు ఎందుకు అవుతా అంటూ చెప్పుకొచ్చారు. నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారమే వాస్తవాలు మాట్లాడతా… నేను చెప్పినవి నెగిటివ్ గా వచ్చిన పాజిటివ్ గా వచ్చిన నేను పట్టించుకోను. నేను చెప్పాలనుకున్నది చెప్తా..కానీ రివ్యూలను చూసి సర్వేలను చూసి నేను జ్యోతిష్యం చెప్పనంటూ ఈ సందర్భంగా వేణు స్వామి తెలియజేశారు.

Venu Swamy గుడివాడ అమర్నాథ్ గెలవడం కష్టమే వేణు స్వామి

Venu Swamy : గుడివాడ అమర్నాథ్ గెలవడం కష్టమే… వేణు స్వామి…!

Venu Swamy  ఆ ముగ్గురు నేతలకు చాలా టఫ్…

నేను చెప్పే ప్రతి విషయం జాతకం పై ఆధారపడి ఉంటుంది కానీ సర్వేలు గ్రౌండ్ రియాల్టీ పై ఆధారపడి ఉండవని తెలిపారు. ఈ క్రమంలోనే వేణు స్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో వైసీపీ మంత్రి రోజా గారికి , అంబటి రాంబాబు గారిది ,మినిస్టర్ అమర్నాథ్ గారిది చాలా టఫ్ గా నడిచే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ముగ్గురుది టంకాపోరు నడుస్తుంది కానీ ఓడిపోతారని నేను చెప్పడం లేదంటూ వేణు స్వామి తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది