CM Revanth Reddy : దమ్ముంటే మగాడివైతే నాతో కొట్లాడు… కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM Revanth Reddy : దమ్ముంటే మగాడివైతే నాతో కొట్లాడు… కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 April 2024,7:10 pm

ప్రధానాంశాలు:

  •  CM Revanth Reddy : దమ్ముంటే మగాడివైతే నాతో కొట్లాడు... కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్..!

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలకు దీటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలలో భాగంగా ఇటీవల నారాయణపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ప్రధాని మోడీకి తాకట్టు పెట్టాడని తెలిపారు. పాలమూరు జిల్లాలో బీజేపీ కి ఓట్లు వేయాల్సిందిగా బీఆర్ఎస్ నాయకులను , సొంత పార్టీ కార్యకర్తలను కోరుతున్నట్లుగా తెలియజేశారు. అదేవిధంగా చేవెళ్లలో కూడా బీఆర్ఎస్ లీడర్లను బీజేపీకి లొంగిపొమ్మని చెబుతున్నారు.

CM Revanth Reddy దమ్ముంటే మగాడివైతే నాతో కొట్లాడు కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్

CM Revanth Reddy : దమ్ముంటే మగాడివైతే నాతో కొట్లాడు… కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్..!

CM Revanth Reddy : దమ్ముంటే నాతో కొట్లాడు….

భువనగిరి , మల్కాజ్గిరి, జహీరాబాద్, చేవెళ్ల ,మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన ధోరణి వినిపిస్తోంది. అయితే ఈ ఐదు స్థానాలలో కాంగ్రెస్ గెలుపు ఖాయం. అందుకే ఆ స్థానాలలో కాంగ్రెస్ ని దెబ్బతిస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీసినట్టే అనే ఆలోచనలో మోడీ కేసీఆర్ నడుస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. నా మీద కోపం ఉంటే నాతో కొట్లాడండి , మా కార్యకర్తలతో కొట్లాడండి మేము తప్పు చేసి ఉంటే ప్రజలకు తెలిసేలా చెప్పండి అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. అలాగే 100 రోజుల పాలనలోనే నన్ను గద్దే దించాలని కేసీఆర్ అంటున్నాడు. మరి 10 ఏళ్లుగా గద్దే మీద ఉన్న మోదీని ఎందుకు గద్దే దించాలి అనుకోట్లే అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

CM Revanth Reddy దమ్ముంటే మగాడివైతే నాతో కొట్లాడు కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్

CM Revanth Reddy : దమ్ముంటే మగాడివైతే నాతో కొట్లాడు… కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్..!

CM Revanth Reddy : ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ…

తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పనులు చేసింది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాని ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన కొన్ని హామీలను నెరవేర్చలేకపోతున్నానంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. కానీ ఈ లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకి కచ్చితంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నారాయణపేట గడ్డపై నిలబడి చెబుతున్నానంటూ ఎన్నికల ముగిసిన తర్వాత ఆగస్టు 15 లోపు కచ్చితంగా ప్రతి రైతు 2 లక్షల రుణమాఫీ అందుకుంటారంటూ చెప్పుకొచ్చారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది