X-users : ఎక్స్ యూజర్లకు దిమ్మతిరిగే షాక్.. ఇకపై పోస్టు, లైక్ ఏది చేయాలన్నా ఛార్జీలే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

X-users : ఎక్స్ యూజర్లకు దిమ్మతిరిగే షాక్.. ఇకపై పోస్టు, లైక్ ఏది చేయాలన్నా ఛార్జీలే..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 April 2024,6:30 pm

ప్రధానాంశాలు:

  •  X-users : ఎక్స్ యూజర్లకు దిమ్మతిరిగే షాక్.. ఇకపై పోస్టు, లైక్ ఏది చేయాలన్నా ఛార్జీలే..!

X-users : సోషల్ మీడియాలో ఎక్స్ కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఫేస్ బుక్ తర్వాత అంతగా పాపులర్ అయింది ఎక్స్. ఒకప్పుడు ట్విట్టర్ గా ఉండే దాన్ని ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చేశారు. దాంతో పాటు కొన్ని టెక్నికల్ కండీషన్లను కూడా అప్లై చేస్తున్నారు. అయితే ఇన్ని రోజులు ఎక్స్ లో ఏదైనా పోస్టు చేయాలన్నా లేదంటే లైక్ చేయాలన్నా చివరకు కామెంట్ చేయాలన్నా సరే అన్నీ ఫ్రీగానే ఉండేవి. కానీ ఇప్పుడు ఎలన్ మస్క్ దాన్ని కమర్షియల్ చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది.

X users ఎక్స్ యూజర్లకు దిమ్మతిరిగే షాక్ ఇకపై పోస్టు లైక్ ఏది చేయాలన్నా ఛార్జీలే

X-users : ఎక్స్ యూజర్లకు దిమ్మతిరిగే షాక్.. ఇకపై పోస్టు, లైక్ ఏది చేయాలన్నా ఛార్జీలే..!

X-users : ఛార్జీలు అందుకోసమేనట..

ఇకపై ఎక్స్ లో ఏం చేయాలన్నా సరే ఛార్జీలు చెల్లించాల్సిందేనంట. పోస్టు చేయాలన్నా, వేరొకరి పోస్టును లైక్ చేయాలన్నా, ఇతరుల పోస్టులకు కామెంట్ పెట్టాలన్నా సరే ఇలా ఏది చేయాలన్నా ఛార్జీలే వర్తిస్తాయంట. కాగా యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు మస్క్ చెబుతున్నారు. ఫేక్ ప్రచారాన్ని, తప్పుడు సమాచారాన్ని అరికట్టడంలో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు. కాకపోతే ఎక్స్ ను ఫాలో చేయడానికి, బ్రౌజ్ చేయడానికి మాత్రం ఎలాంటి చార్జీలు వుండవని తెలిపారు.

ఇక కొత్తగా ఎవరైనా ‘ఎక్స్’ అకౌంట్ ఉపయోగిస్తే మాత్రం వారు కచ్చితంగా ఏడాదికి కొంత ఫీజును చెల్లించాల్సిందే. కాగా ఈ ఛార్జీలు ఎలా ఉంటాయి, పోస్టుకు ఎంత, లైక్ కొట్టడానికి ఎంతుంటాయి, ఏడాదికి మొత్తం ఎంత ఉంటుంది అనేది మాత్రం ఇంకా తెలియలేదు. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మస్క్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు, యూజర్లు ఫైర్ అయ్యేఅవకాశాలు ఉన్నాయి. ఇలా చేస్తే ఎక్స్ లో యూజర్ల సంఖ్య తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు చెల్లించి ఎక్స్ ను వాడాల్సిన అవసరం పెద్దగా ఎవరికి ఉంటుంది.

X users ఎక్స్ యూజర్లకు దిమ్మతిరిగే షాక్ ఇకపై పోస్టు లైక్ ఏది చేయాలన్నా ఛార్జీలే

X-users : ఎక్స్ యూజర్లకు దిమ్మతిరిగే షాక్.. ఇకపై పోస్టు, లైక్ ఏది చేయాలన్నా ఛార్జీలే..!

అంతే కాకుండా ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను ఇలా కమర్షియల్ గా మార్చడం అంటే సమాజం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో మస్క్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఇప్పటి నుంచే రిక్వెస్టులు వెళ్తున్నాయి. చూడాలి మరి మస్క్ ఏం చేస్తాడో.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది