Balakrishna Jana Reddy : రేవంత్ రెడ్డిదూకుడు.. జానారెడ్డి, బాల‌కృష్ణ ఇళ్ల‌కి మార్కింగ్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna Jana Reddy : రేవంత్ రెడ్డిదూకుడు.. జానారెడ్డి, బాల‌కృష్ణ ఇళ్ల‌కి మార్కింగ్‌..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 December 2024,1:25 pm

ప్రధానాంశాలు:

  •  Balakrishna Jana Reddy : రేవంత్ రెడ్డిదూకుడు.. జానారెడ్డి, బాల‌కృష్ణ ఇళ్ల‌కి మార్కింగ్‌..!

Balakrishna Jana Reddy : రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం దూకుడు మీద ఉంది. శుక్రవారం మొత్తం అల్లు అర్జున్ అరెస్ట్ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ హీట్ శనివారం కూడా కంటిన్యూ అవ్వగా.. రాత్రికి బాలకృష్ణ – జానారెడ్డి పేరుతో మరో సంచలనం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులు బుల్డోజర్లుతో వాటిని నేలమట్టం చేస్తున్నారు. దీంతో బుల్డోజర్ పేరు విన్నా.. దాని అలకిడి విన్నా నగర ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా.. హీరో నందమూరి బాలకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇళ్లకు త్వరలోనే బుల్డోజర్లు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Balakrishna Jana Reddy రేవంత్ రెడ్డిదూకుడు జానారెడ్డి బాల‌కృష్ణ ఇళ్ల‌కి మార్కింగ్‌

Balakrishna Jana Reddy : రేవంత్ రెడ్డిదూకుడు.. జానారెడ్డి, బాల‌కృష్ణ ఇళ్ల‌కి మార్కింగ్‌..!

Balakrishna Jana Reddy ఇప్పుడు బాల‌య్య‌కి టెన్ష‌న్…

నగరంలో రోడ్డు విస్తరణ చేపట్టగా.. అందులో బాలకృష్ణ, జానారెడ్డి, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు తమ నివాస స్థలాలను కోల్పోనున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయా ఇండ్లకు మార్కింగ్ చేసిన‌ట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రోడ్డు వెడల్పు చేయడానికి పలువురి ఇళ్లకు అధికారులు మార్కింగ్ వేశారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని జానారెడ్డి ఇంటి కాంపౌండ్, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45లోని బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ చేశారు. బాలకృష్ణ నివాసానికి దాదాపు ఆరు అడుగుల మేర మార్కింగ్ వేశారు. తమ నివాసాలకు మార్కింగ్ చేయడంపై వారు ఒకింత అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్, మహారాజ అగ్రసేన్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.45, చెక్‌పోస్టు, కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు కూడళ్లలో రూ.1,200 కోట్లతో ఏడు ఐరన్ బ్రిడ్జిలు, ఆరు అండర్‌పాస్‌లను నిర్మించనుండగా.. ఆ పనుల్లో వేగం పెంచారు. అయితే బాలకృష్ణ ఇల్లు రోడ్డు నం.45, 92 కూడలి వద్ద ఉండటంతో రెండు వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆయన దాదాపు సగం భూమి నష్టపోతారని అంచనా. ఇక ఒమేగా హాస్పిటల్ సమీపంలో జానారెడ్డికి రెండు ప్లాట్లున్నాయి. వాటిని 43 అడుగుల మేర రోడ్డు కోసం సేకరించాల్సి వస్తోంది. ఈ విస్తరణలో ఆయన దాదాపు 700 గజాలు ఆయన నష్టపోవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ఆయా ఇండ్లకు మార్కింగ్ చేశారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది