Balakrishna : రేయ్.. నా చిటికినవేలు మీద ఉన్న బొచ్చు కూడా పీకలేవ్.. జగన్‌కు సినిమా స్టైల్‌లో అదిరపోయే వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Balakrishna : రేయ్.. నా చిటికినవేలు మీద ఉన్న బొచ్చు కూడా పీకలేవ్.. జగన్‌కు సినిమా స్టైల్‌లో అదిరపోయే వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ

Balakrishna : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఈనేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నేతలు రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబును కావాలని అక్రమంగా అరెస్ట్ చేశారని నినదిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు పండుగ చేసుకుంటున్నారు. మంత్రి రోజా, కొడాలి నాని అయితే చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదంతా వైఎస్ జగన్ చేసిన […]

 Authored By kranthi | The Telugu News | Updated on :1 October 2023,4:00 pm

Balakrishna : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఈనేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నేతలు రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబును కావాలని అక్రమంగా అరెస్ట్ చేశారని నినదిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీ నేతలు పండుగ చేసుకుంటున్నారు. మంత్రి రోజా, కొడాలి నాని అయితే చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదంతా వైఎస్ జగన్ చేసిన కుట్ర అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై బాలకృష్ణ స్పందించారు. జగన్ గురించి ఎవరికి తెలియదు. జగన్ చరిత్ర ఏంటి. 33 కేసుల్లో సీబీఐ కేసులు, ఈడీ కేసులు అన్నీ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. వాళ్ల మీద ఎన్ని కేసులు ఉన్నా బెయిల్ మీద ఎలా తిరుగుతున్నాయి. 10 ఏళ్ల నుంచి ఇన్ని కేసులు ఉన్నా ఎందుకు బెయిల్ మీద తిరుగుతున్నారు అంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యారు…

ఇన్నర్ రింగ్ రోడ్ లో స్కామ్ జరిగిందా? భూములు స్వచ్ఛందంగా ఇస్తే అక్కడ కేసు ఎలా అవుతుంది. అసలు భూములు ఇప్పటి వరకు నోటిఫై కాలేదు. దానికి అనుమతులు లేవు. అది క్లారిటీగానే ఉంది. ఆ పనులు ఇంకా జరగనేలేదు. ఎవరో లబ్దిపొందితే.. ఎవరి మీద కేసులు పెడుతున్నారు. సీఎం జగన్ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది. అప్పుడు శాంక్షన్ అయిన ఓఆర్ఆర్ ని అష్ట వంకరలు తిప్పారు. అప్పుడు అంబటి రాంబాబు వీళ్లంతా లబ్ధి పొందలేదా? అంటూ బాలకృష్ణ మండిపడ్డారు. కేసు అంటే ఏంటి.. ఎవరైనా ఫిర్యాదు చేయాలి. ఎవరైనా ఫిర్యాదు చేశారా? అంటూ ప్రశ్నించారు.

Balakrishna రేయ్ నా చిటికినవేలు మీద ఉన్న బొచ్చు కూడా పీకలేవ్ జగన్‌కు సినిమా స్టైల్‌లో అదిరపోయే వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ

Balakrishna : రేయ్.. నా చిటికినవేలు మీద ఉన్న బొచ్చు కూడా పీకలేవ్.. జగన్‌కు సినిమా స్టైల్‌లో అదిరపోయే వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ

Balakrishna : యువగళానికి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే ఇదంతా?

నారా లోకేష్ ప్రస్తుతం యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఆయన యాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక కక్ష సాధింపు చర్యగా ఇవన్నీ చేస్తున్నారు. చంద్రబాబు చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేరు. పిక్క మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేరు.. అంటూ బాలకృష్ణ మండిపడ్డారు. అరెస్టులకు భయపడే రకం కాదు మేము. జైలుకు వాళ్లకు భయపడాలి కానీ.. మేము భయపడం. తప్పు చేయనప్పుడు మేము దేవుడికి కూడా భయపడం.. అంటూ బాలకృష్ణ.. జగన్ కు వార్నింగ్ ఇచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది