Bandla Ganesh : పవర్ లేనివాడికి అంత బలుపు ఎందుకు.. కేటీఆర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bandla Ganesh : పవర్ లేనివాడికి అంత బలుపు ఎందుకు.. కేటీఆర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..!

 Authored By anusha | The Telugu News | Updated on :25 December 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Bandla Ganesh : పవర్ లేనివాడికి అంత బలుపు ఎందుకు.. కేటీఆర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..!

Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత, కాంగ్రెస్ పార్టీ అభిమాని అయిన బండ్ల గణేష్ నిత్యం ఏదో ఒక వార్తల్లో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా ఆయన తెలంగాణలో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితికి తేరుకోలేని కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బండ్ల గణేష్ మాట్లాడుతూ… పవర్ లేని పవర్ ప్రజెంటేషన్ మీకెందుకు సార్. మాట్లాడితే గత పాలకులు గత పాలకులు అని ఎన్నిసార్లు మాట్లాడుతారు. ఆ మాటకి విసుగు కూడా వస్తుందిష గత పది ఏళ్ల నుంచి మీరు ఈ రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేసారో చెప్పండి. మేము చెప్తాం.. గత పదేళ్ల నుంచి మీరేం దోచుకున్నారో మాకు తెలుసు.

మీరు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో.. ఆర్థికంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో.. మీ నాయకులు, మీరు, మీ జీవన విధానం ఎలా మారిపోయిందో..తెలంగాణ ప్రజలు ఎంత వెనుక పడ్డారో..మీరెంత ముందుకు పోయారో..మేము చెప్తాం అని బీఆర్ఎస్ పై బండ్ల గణేష్ మండిపడ్డారు. అధికారం లేక నిద్ర పట్టడం లేదా అంటూ విమర్శించారు. కాంగ్రెస్ అధికారం చేపడుతుంటే మీకు నిద్ర పట్టడం లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం చాలా గొప్పది. ప్రజలు మీరు బాగా చేయలేదని కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు.

అది మీరు చూసి తట్టుకోలేక కాంగ్రెస్ పాలన ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం అంటూ విమర్శించడం తగదు అని బండ్ల గణేష్ బీఆర్ఎస్ నాయకుల పై మండిపడ్డారు. మీరు చేసిన తప్పులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు పడేస్తుందని భయపడుతున్నారా అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందని, ముఖ్యమంత్రి , మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, అనుక్షణం అందరికీ న్యాయం చేస్తున్నారని, ప్రజలు సుఖసంతోషాలతో కళకళలాడుతుంటే మీరు దానిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు..ఇప్పటికైనా ఆగండి అని బండ్ల గణేష్ హితవు పలికారు. ప్రస్తుతం బండ్ల గణేష్ బి ఆర్ ఎస్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి దీనిపై బిఆర్ఎస్ నాయకులు ఎలా తిప్పికొడతారో చూడాలి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది