Barrelakka Sirisha : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బర్రెలక్క అలియాస్ శిరీష చర్చనియాంశంగా మారారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి శిరీష స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. నిరుద్యోగుల తరపున పోరాడేందుకు తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించి నామినేషన్ దాఖలు చేశారు. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకెళుతున్నారు. ఆమెకు ప్రజలతోపాటు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుంది. అయితే తాజాగా బర్రెలక్క కన్న తండ్రి ఆమె గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో బర్రెలక్క తండ్రి మాట్లాడుతూ.. శిరీష అలియాస్ బర్రెలక్కకు ఘనంగా పెళ్లి చేశానని చెప్పారు. కానీ ఆమె భర్త నుంచి విడాకులు తీసుకొని తల్లితో ఉంటుందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో తన తండ్రి తాగుబోతు మమ్మల్ని పట్టించుకోలేదని చెడు ప్రచారం చేస్తుందని, అదేమీ నిజం కాదని ఆయన వెల్లడించారు. కూతురు జీవితం బాగుండాలని ఇంటర్మీడియట్, అగ్రికల్చర్ కోర్స్ చదివించానని ఆయన అన్నారు. కుటుంబానికి అండగా ఉన్నానని కానీ వాళ్ళు లేని నిందలు నాపై మోపి దూరం పెట్టారని ఆయన వాపోయారు.
ఆస్తులు కూడా సంపాదించి పెట్టానని, డాడీ నేను చదువుకొని నీ పేరు నిలబెడతానంటే ఐఏఎస్ అయ్యేంతవరకు చదివించాను అని, దానికోసం వంటల పని, హోటల్ నడిపించాను అని ఆమె తండ్రి చెప్పుకొచ్చారు. కానీ బర్రెలక్క మాత్రం బుద్ధిగా చదువుకోలేదని తెలిపారు. 10వ తరగతి చదివేటప్పుడు అమ్మ తిట్టిందని, అందరూ తిడుతున్నారని నిద్ర మాత్రలు మింగిందని తెలిపారు. పదేళ్ల క్రిందట మా నాన్న మమ్మల్ని వదిలేశాడని చెబుతుంది. మరి నేను అప్పుడు వదిలేసి వెళ్తే వీళ్లను చదివించింది ఎవరు? నేనే చదివించాను కదా అని అన్నారు. రెండు ఇళ్లు కూడా కట్టించాను అని బర్రెలక్క తండ్రి తెలిపారు. ఈ వ్యాఖ్యలపై బర్రెలక్క ఏ విధంగా స్పందిస్తారో చూడాలి…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.