Barrelakka Vs CM KCR : సోషల్ మీడియా Social Media ద్వారా బర్రెలక్క Barrelakka ఫుల్ ఫేమస్ అయ్యారు. గతంలో ఉద్యోగం లేక గేదెలు కాస్తున్నానంటూ చేసిన వీడియోతో శిరీష బర్రెలక్కగా Barrelakka Shirisha స్థిరపడిపోయారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె పేరు చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం ఆమె కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం kollapur assembly constituency నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడమే. నాగర్ కర్నూలు Nagarkurnool జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసురుతున్నారు. నిరుద్యోగ అంశమే ప్రధానంగా ఆమె ఎన్నికల బరిలోకి దిగారు. ఇటీవల కొల్లాపూర్ నియోజక వర్గం ప్రచారంలో భాగంగా బర్రెలక్క మాట్లాడుతూ.. నువ్వు ఒక ఆడపిల్లవి నువ్వు ఏమి చేయలేవు అన్నారు.
చాకలి ఐలమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయి వీరంతా ఎవరు.. ? మాది చాలా పేద కుటుంబం. డిగ్రీ చదివాను. ఉద్యోగం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అందుకే పోరాడుదామని కొల్లాపూర్ నియోజకవర్గంలో నామినేషన్ వేశాను. దీంతో నన్ను భయపెట్టించారు. నామినేషన్ విత్ డ్రా చేసుకో, నీకు కావలసినంత డబ్బు ఇస్తామని బెదిరించారు. అయినా నేను భయపడను కొల్లాపూర్ ప్రజల సమస్యలను తీర్చడానికి ముందుకొచ్చాను. ఈల గుర్తుకే ఓటు వేయండి అని ఆమె చెప్పుకొచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీ BRS Party ప్రచారంలో భాగంగా కేసీఆర్ KCR కొల్లాపూర్ నియోజక వర్గం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ..లగతంలో కొల్లాపూర్ kollapur ఎట్లుండేది. పెద్దకొత్తపల్లి కి అప్పుడు ముంబై బస్సులు ఎక్కువగా ఉండేవి. అక్కడ ఉండే కుంఫు మేస్త్రిలంతా ముంబైకి పని కోసం వెళ్లేవారు. గతంలో అట్లా ఉండే కొల్లాపూర్ ఇప్పుడు ఎలా ఉంది. ఎవరో వచ్చి చెబుతా ఆగమవుతారా, అలా మాట్లాడడానికి సిగ్గుండాలి అని ఆయన అన్నారు. గతంలో ఇందిరమ్మ తెలంగాణను వెనకబడ్డ రాష్ట్రం అని, మీరు కేవలం జొన్నలు మాత్రమే పండించుకోవాలని అనేవారు. మీకు నీళ్లు రావు, వడ్లు పండవు, తెలివి కూడా లేదు అని అనేవారు.
కానీ ఇవాళ Telangana తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వడ్లు పండుతున్నాయి. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. కొల్లాపూర్ లోనే లక్ష 25 వేల ఎకరాలలో వడ్లు పండుతున్నాయి ఇదంతా తెలంగాణ వచ్చాకే సాధ్యమైంది. గతంలో కొల్లాపూర్ లో మంచినీళ్లు కూడా లేవు. పక్కనే కృష్ణా నది ఉన్న కొల్లాపూర్ కి నీళ్లు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ Congress పార్టీ. కరెంటు ఇచ్చారా. .2000 పెన్షన్ ఇచ్చారా.. ఇదంతా మీరే ఆలోచించాలి ఇవి ఓట్లు కాదు తెలంగాణ బ్రతుకుతెరువు పోరాటం అని ఆయన అన్నారు.
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
This website uses cookies.