Home » News » Benefits Of Kisan Vikas Patra Scheme
News

Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రజలకు ఈ పథకం ఓ గొప్ప‌ వరం… ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఉండలేరు..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 7, 2025, 6:00 pm
Advertisement

Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్ర (KVP) అనే ప్రత్యేక పొదుపు పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది ముఖ్యంగా రైతులు, చిన్న పొదుపుదారుల కోసం రూపొందించినదిగా చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా వారు తక్కువ మొత్తంతో కూడిన పెట్టుబడిని పెట్టి, కాలక్రమంలో రెట్టింపు ఆదాయం పొందే అవకాశాన్ని పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా అందించే ఈ పథకం, పెట్టుబడిని సురక్షితంగా ఉంచడమే కాకుండా, భద్రత కలిగిన ఆదాయ మార్గాన్ని కూడా కల్పిస్తుంది.

Advertisement

Kisan Vikas Patra Scheme : గ్రామీణ ప్రజలకు ఈ పథకం ఓ గొప్ప‌ వరం… ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఉండలేరు..!

Kisan Vikas Patra Scheme : కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తో రెట్టింపు లాభాలు

ఈ పథకం ప్రత్యేకత ఏంటి అంటే.. మీరు పెట్టే డబ్బు ఒక నిర్దిష్ట కాలానికీ రెట్టింపు అవుతుంది. ప్రస్తుతానికి, ఈ డబ్బు రెట్టింపు కావడానికి సుమారుగా 115 నెలలు (9 సంవత్సరాలు 7 నెలలు) పడుతుంది. కనీస పెట్టుబడి రూ. 1000 మాత్రమే కాగా, ఎక్కువ మొత్తంలోనూ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో మూడు రకాల సర్టిఫికెట్లు ఉన్నాయి: సింగిల్ హోల్డింగ్ (ఒక్కరి పేరిట), జాయింట్ ఏ (ఇద్దరు కలిపి, ఒకరు చనిపోతే మరొకరికి డబ్బు అందేలా), జాయింట్ బీ (ఇద్దరూ కలసి డబ్బు తీసుకోవచ్చుని).

Advertisement

కిసాన్ వికాస్ పత్ర పథకానికి భారతీయ పౌరులెవరికైనా అర్హత ఉంది. 18 ఏళ్ల పైబడినవారే దీనికి దరఖాస్తు చేయగలరు. మైనర్ పేరుపైన కూడా ఈ పథకంలో సర్టిఫికెట్ తీసుకోవచ్చు, కానీ అతనికి న్యాయబద్ధమైన సంరక్షకుడు ఉండాలి. ఈ విధంగా, కిసాన్ వికాస్ పత్ర పథకం ఒక వైపు పొదుపును పెంపొందిస్తూనే, మరోవైపు భద్రతతో కూడిన పెట్టుబడి అవకాశాన్ని కూడా అందిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే, భవిష్యత్తులో ఆర్థిక భద్రతను కలిగి ఉండొచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి