Husband Wife : అదృష్టం అంటే ఇదే.. భార్యాభర్తలు డిన్నర్‌కు వెళ్లి రూ.12.8 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారుగా !
Husband Wife : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భార్యాభర్తలకు అదృష్టం మాములుగా లేదు. కేవలం 3 డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ. 257 విలువైన స్క్రాచ్ ఆఫ్ టికెట్‌తో వారికి ఏకంగా 1.5 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.12.86 కోట్లు దక్కాయి. సరదాగా హోటల్‌కు డిన్నర్‌కు వెళ్తుండగా.. ఆ మార్గంలో అనుకోకుండా కొనుగోలు చేసిన ఆ స్క్రాచ్ ఆఫ్ టికెట్ వారి ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.
Husband Wife : అదృష్టం అంటే ఇదే.. భార్యాభర్తలు డిన్నర్‌కు వెళ్లి రూ.12.8 కోట్ల జాక్‌పాట్ కొట్టేశారుగా !
న్యూజెర్సీలోని నట్లీ ప్రాంతంలోని 397 సెంటర్ స్ట్రీట్‌లో ఉన్న లక్కీ 7 డెలిలో వైన్ ఫర్ లైఫ్.. స్క్రాచ్-ఆఫ్ టికెట్‌ను కొనుగోలు చేశారు. అయితే ఈ టికెట్ విజేతగా నిలవడంతో వారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆ టికెట్‌ను స్క్రాచ్ చేసి చూడగా.. అదే మొదటి ప్రైజ్ దక్కించుకోవడం చూసి తాను నమ్మలేకపోయానని వారు చెప్పారు. అయితే ఆ దంపతులు మాత్రం తమ పేరు, అడ్రస్ చెప్పడానికి నిరాకరించారు.
వారు 10 డాలర్ల టికెట్‌తోపాటు రెండు 3 డాలర్ల విన్ ఫర్ లైఫ్ టికెట్లు కొన్నట్లు చెప్పారు. ఈ టికెట్ గెలుచుకోవడంతో తమ జీవితాలు పూర్తిగా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ లాటరీలో వచ్చిన మొత్తాన్ని ఒకేసారి తీసుకోకూడదని ఆ జంట నిర్ణయించుకుంది. ఏడాదికి కొంత చొప్పున మొత్తం 25 ఏళ్ల పాటు ఆ డబ్బు తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. న్యూజెర్సీ లాటరీ వెబ్‌సైట్ ప్రకారం వారు ఒకేసారి మొత్తం తీసుకుంటే అది 8.75 లక్షల డాలర్లు మాత్రమే వస్తాయని తెలుస్తోంది.
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…
This website uses cookies.