YCP : 2024 లో వైసీపీ గెలవబోయే మొట్టమొదటి నియోజకవర్గం ఇదే !
YCP : ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీ గెలుస్తుందా? ఎన్ని సీట్లలో గెలుస్తుంది? అంటే.. ఆ సీట్లను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. అయితే.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కూడా ఆ లిస్టులో ఉంది. అందుకే.. ఆళ్లగడ్డ వైసీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే.. పక్కాగా వైసీపీ గెలిచే సీటు ఇది. వైసీపీపై వ్యతిరేకత అన్ని చోట్ల ఉన్నా కూడా ఆళ్లగడ్డ మాత్రం కొంచెం స్పెషల్.ఎందుకు స్పెషల్ అంటే.. భూమా కుటుంబంలో విభేదాలే ఆళ్లగడ్డ ఎమ్మెల్యేకు కలిసి వస్తోంది.
ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బ్రిజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన ఇక నక్క తోక తొక్కినట్టే లెక్క. ఎందుకంటే.. భూమా వారసురాలు అఖిలప్రియ ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. అదే బ్రిజేంద్రనాథ్ రెడ్డికి ప్లస్ పాయింట్ అవుతోంది. అఖిలప్రియ పోకడలకు విసుగెత్తిన భూమా అనుచరులు ఆమెకు దూరం అయ్యారు. భూమా అఖిలప్రియ, ఆమె చెల్లి మౌనిక ఇద్దరూ ప్రస్తుతం కలిసి లేరు. విడిపోయారు. దీంతో ఆమె ఇంకా ఒంటరి అయిపోయింది.
YCP : అక్కాచెల్లెళ్లు కూడా విడిపోయారా?
అఖిలప్రియపై నియోజకవర్గ నేతలు గుర్రుగా ఉన్నారు. భూమా ఫ్యామిలీ సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో భూమా అనుచరులు మొత్తం ప్రస్తుతం అటువైపే ఉన్నారు. భూమా ఫ్యామిలీకి అసలైన వారసుడు కిశోర్ కుమార్ రెడ్డి అని.. అఖిలప్రియ కాదని తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు బ్రహ్మానందరెడ్డితో కూడా అఖిలప్రియకు పొసగడం లేదు. అసలు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి అఖిలప్రియకు టికెట్ వస్తుందో లేదో కూడా డౌటే. ఇలాంటి నేపథ్యంలో వైసీపీకే అక్కడ ఫేవర్ గా నడుస్తున్నట్టు తెలుస్తోంది.