Bhuma Akhila Priya : బ్రేకింగ్ : టీడీపీ కి భూమా అఖిలప్రియ రాజీనామా ?
bhuma akhila priya : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం లో రాజకీయ వాతావరణం రసవత్తరంగా మారింది. మొదటినుంచి నంద్యాల ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా కుటుంబానికి ప్రత్యేకమైన పొలిటికల్ ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే. భూమా దంపతులు మరణించిన తర్వాత భూమా అఖిలప్రియ రాజకీయంగా ఎదుగుతూ వస్తున్నారు. కానీ ఇటీవల కుటుంబంలోనే గ్రూపు తగాదాలు పెరగడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. కొద్ది నెలల క్రితం భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న మంచు మనోజ్.. టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు.
చంద్రబాబు సైతం ఇందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మంచు మనోజ్ ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు టాక్. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న భూమా అఖిలప్రియ అసహనానికి లోనైనట్లు సమాచారం. ఒకపక్క తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి తో నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్న సమయంలో ఇప్పుడు సొంత చెల్లి భర్త తనకు పోటీ వస్తూ ఉండటంతో.
bhuma akhila priya resigns from tdp
పాటు అధినేత అండ కూడా తనకి లేకపోవడంతో అఖిలప్రియ టీడీపీ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఇదే జరిగితే అఖిలప్రియ పొలిటికల్ గా తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది నంద్యాల జిల్లా రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.
