
Love Marriage
Love Marriage : దేశంలో పరిస్థితులు చాలా అధ్వానంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మణిపూర్ రాష్ట్రంలో జరిగిన మారణకాండ కి అంతర్జాతీయ స్థాయిలో ఇండియా పరువు పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఇండియాలో మేధావులు ప్రపంచవ్యాప్తంగా మతాలు గురించి గొడవలు జరిగిన దేశాల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని ఇది దేశానికి మంచిది కాదని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇండియా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రపంచంలో చాలా రంగాలలో భారతీయులే ప్రతిభావంతులుగా రాణిస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశంలో కొన్ని ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి.
ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని సరికొత్త రూల్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ప్రేమ ఎవరి భయపడుతుందో చెప్పలేని పరిస్థితి క్రమంలో ఈ నిర్ణయం అనేక ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విషయంలోకి వెళ్తే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రేమ వివాహాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గుజరాత్ రాష్ట్రంలో ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడించారు.
Love Marriage
రాజ్యాంగబద్ధంగా సాధ్యమైతే ఈ ప్రతిపాదనను అమలులోకి తెస్తామని పేర్కొన్నారు. పాటీదార్ వర్గానికి ప్రాతినిధ్యం వహించే ‘సర్దార్ పటేల్ గ్రూప్’ మెహ్సానాలో నిర్వహించిన సమావేశానికి సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. పాటీదార్ వర్గం నుంచి వస్తున్న డిమాండ్లకు స్పందనగా ఈ వ్యాఖ్యలు చేశారు.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.