Bhuvaneshwari : భర్త చంద్రబాబుని అరెస్టు చేయడంతో భువనేశ్వరి ఎమోషనల్ కామెంట్స్..!!

Advertisement

Bhuvaneshwari : స్కిన్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉందని ఈరోజు ఉదయం సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖండిస్తున్నారు. ఈ క్రమంలో భర్త చంద్రబాబునాయుడు చేయడంతో భార్య భువనేశ్వరి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. సోదరుడు రామకృష్ణ తో కలిసి దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన భర్తను అరెస్టు చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బిడ్డకు మనసు బాగో లేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్తాడు.

Advertisement

అందుకే విజయవాడ కనకదుర్గమ్మకు నా బాధను చెప్పుకోవడానికి, ఆమె ఆశీర్వచనం కోసం ఇక్కడకు వచ్చాను. అమ్మవారిని నేను కోరింది ఒకటే. మా ఆయన చంద్రబాబును రక్షించమని, ఆయనకు మనోధైర్యం ఇవ్వాలని కోరుకున్నా. ఆయన పోరాటం ఆయన ఒక్కరి కోసమో, ఆయన కుటుంబం కోసమో కాదు. ఆయన పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం. నేను ఒక్కటే కోరుతున్నా… మీ అందరి కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటం దిగ్విజయం కావడానికి అందరూ చేయిచేయి కలపాలి. జై దుర్గాదేవి, జైహింద్, జై అమరావతి’ అని భువనేశ్వరి అన్నారు. ఇదే క్రమంలో నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ.. కావాలని చంద్రబాబుని వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పాలు చేస్తున్నట్లు కన్నీరు పెట్టుకున్నారు.

Advertisement
bhuvaneshwari emotional comments after husband chandrababu arrest
bhuvaneshwari emotional comments after husband chandrababu arrest

ఇదే సమయంలో చేయి చేయి కలిపి చంద్రబాబు పోరాటం దిగ్విజయం కావాలని కోరుతున్న. మీరందరూ పోరాటం చేయాలి అది మీ హక్కు. అందరి ఆశీస్సులు మా కుటుంబానికి కావాలి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. చంద్రబాబు తెలుగు రాష్ట్ర ప్రజల కోసం శ్రమిస్తున్నారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచుదాం అంటూ రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement