Botsa Satyanarayana : బొత్స గెలుపు లాంఛనమే.. ఆయన గెలిస్తే వైసీపీలో ఏం జరగనుంది ?
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠరేపిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వ్యవహారం మరో మలుపు తిరగడం అందరిని ఆశ్చర్యపరచింది.. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ కూటమి నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో నిర్ణయం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదని.. హుందా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీతో పాటూ కూటమి నేతలు కూడా ఓకే చెప్పారు.
ముఖ్యమంత్రి అత్యంత హుందాగా వ్యవహరించారని నేతలు అభిప్రాయపడ్డారు. నేటితో ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగుస్తుండగా.. చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు. దీంతో బొత్స గెలుపు లాంఛనమే అంటున్నారు. బొత్స గెలిస్తే అది వైసీపీకి బూస్ట్ ఇచ్చినట్లుగా ఉంటుందని, విశాఖ జిల్లాలో వైసీపీ మళ్లీ లేచి నిలబడడానికి ఒక ఆస్కారం ఇచ్చినట్లుగా ఉంటుందని అంటున్నారు.. అదే విధంగా అటు శాసనమండలిలో ఒక సీనియర్ నేత పార్టీకి దొరికిన వారు అవుతారు. విశాఖ జిల్లాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 850 ఓట్లుండగా, అందులో 550 ఓట్లు వైసీపీికి ఉన్నాయి. ఈ ఓట్లలో ఎక్కువ భాగం వాళ్లు క్యాంప్‌నకు తరలించారు.
Botsa Satyanarayana : బొత్స గెలుపు లాంఛనమే.. ఆయన గెలిస్తే వైసీపీలో ఏం జరగనుంది ?
ఆగస్టు 30వ తేదీన ఎన్నిక జరుగుతుంది. అప్పటి వరకూ క్యాంప్ వదిలి బయటకు రారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. పోటీ చేసి ఓటమి పాలయికంటే గౌరవంగా ఉంటుందని చంద్రబాబు భావించే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే టీడీపీ పోటీ చేయకపోవచ్చు. మరి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతుంది. బొత్సని గెలిపించడం ద్వారా పార్టీ పుంజుకుంటుందనే అభిప్రాయం జనాలలో కలిగించాలని జగన్ భావిస్తున్నారు. బొత్సను గెలిపించుకుంటే విశాఖ జిల్లా కేంద్రంగా కూటమి సాగిస్తున్న రాజకీయానికి అడ్డుకట్ట వేయాలని కూడా వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. అలాగే విశాఖ జిల్లా రాజకీయాలను సైతం చక్కబెట్టేలా వైసీపీ చూస్తోంది
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.