Rythu Runa Mafi : తెలంగాణ ప్రభుత్వం రైతులకి వరుస గుడ్ న్యూస్‌లు చెబుతుంది. రైతాంగం ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తోన్న మూడో విడత రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని ఉప-ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ తీరుతామన్న ముఖ్యమంత్రి ఎనముల రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌ను నిరూపించుకోనున్నామని ఆయన అన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జులై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది. మెుత్తం మూడు విడతల్లో మాఫీ చేస్తుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్ష, రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న మూడో విడతగా రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఇప్పటి వరకు రెండు విడతల్లో రుణమాఫీ జరగ్గా.. కొందరు అర్హులైన రైతులకు మాఫీ జరగలేదు. బ్యాంక్ అకౌంట్ నెంబర్లలో తప్పులు, ఆధార్ వివరాలు సరిపోలకపోవటం, వివిధ సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ జరగలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తమకు రుణమాఫీ జరగలేదని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్‌న్యూస్ చెప్పారు. అర్హతలు ఉన్నా.. రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. అటువంటి వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. రైతులెవరూ ఆధైర్యపడొద్దని.. ఆందోళనకు గురికావొద్దని సూచించారు. తమ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు.
రుణమాఫీ, రైతుభరోసా పథకాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను మంత్రి పొన్నం ఖండిస్తూ.. ఆయన కీలక కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో హరీశ్ ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు సాంకేతిక కారణాలు చూపి 3 లక్షల మంది రైతులకు పంట రుణాలు మాఫీ చేయలేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంటల బీమా అందక పరిహారం లేక చాలామంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకున్నారని పొన్నం తెలియజేశాడు.. రైతు రుణమాఫీ జరగని వారు కాల్ చేయాలని ఇప్పుడు కాల్‌సెంటర్లు పెట్టారని.. అదేదో అప్పుడే పెట్టి ఉంటే రైతులకు మేలు జరిగేదని సూచించారు. అప్పుడేమో కలెక్షన్ సెంటర్లు పెట్టి.. ఇప్పుడు మెుసలి కన్నీరు కారుస్తున్నారంటూ హరీష్ శంకర్ కి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.