Kashmir Pahalgam : పహల్గామ్ ఉగ్రదాడిని కళ్లకు కట్టినట్లు చెప్పిన బాలుడు.. వీడియో !
ప్రధానాంశాలు:
Kashmir Pahalgam : పహల్గామ్ ఉగ్రదాడిని కళ్లకు కట్టినట్లు చెప్పిన బాలుడు..!
Kashmir Pahalgam : జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో తాజాగా జరిగిన ఉగ్రవాద దాడి దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో అనేక అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో తన తండ్రిని కోల్పోయిన ఓ బాలుడు మీడియాతో మాట్లాడుతూ హృదయవిదారకమైన నిజాలను బయటపెట్టాడు. “ఉగ్రవాదులు ముందుగా మమ్మల్ని (హిందువులను) వేరుగా నిలబెట్టారు. ముస్లింలను పక్కకు పంపారు. ఆ తర్వాత మా మీద కాల్పులు ప్రారంభించారు” అని ఆ బాలుడు ఘటన తీరును వివరించాడు.

Kashmir Pahalgam : పహల్గామ్ ఉగ్రదాడిని కళ్లకు కట్టినట్లు చెప్పిన బాలుడు.. వీడియో !
Kashmir Pahalgam పహల్గామ్ ఉగ్రదాడి ఘటన గురించి బాలుడు చెపుతుంటే కన్నీరు ఆగదు
ఈ మాటలు దేశ ప్రజల్ని భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ఈ బాలుడి చెప్పిన దాని ప్రకారం చూస్తే.. ఈ దాడి వెనక ఉన్న మతపరమైన ఉద్దేశాన్ని బయటపెడుతున్నట్లు స్పష్టమవుతుంది. ఉగ్రవాదులు సామాన్య ప్రజల మధ్య భయం మరియు విభేదాలు కలిగించాలనే దురుద్దేశంతోనే హిందువులపై లక్ష్యంగా దాడి జరిపినట్టు అర్థమవుతోంది.
కాశ్మీర్‌లో మతసామరస్యాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు కొనసాగుతుండగా, ఈ దాడి మానవత్వాన్ని తాకట్టు పెట్టిన ఉదాహరణగా నిలుస్తోంది. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో అక్కడి ప్రజలకు భద్రత కల్పించడమే కాకుండా, మత సామరస్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం మరింతగా కనిపిస్తోంది.
#PahalgamTerroristAttack పై నిజాలు చెప్పిన బాలుడు
హిందువులు, ముస్లింలను వేరు వేరుగా నిలబెట్టి హిందువులపై కాల్పులు జరిపారని చెబుతున్న బాలుడు#PahalgamTerroristAttack లో తన తండ్రి కోల్పోయిన బాలుడు
Video: GUJARAT1 News pic.twitter.com/ceLZtJPFCL
— greatandhra (@greatandhranews) April 24, 2025