Altaf Lalli : పహల్గామ్‌ దాడి సూత్రధారి ఖతం.. మిగిలింది వాల్లే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Altaf Lalli : పహల్గామ్‌ దాడి సూత్రధారి ఖతం.. మిగిలింది వాల్లే..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 April 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Altaf Lalli : పహల్గామ్‌ దాడి సూత్రధారి ఖతం.. మిగిలింది వాల్లే..!

Altaf Lalli : పహల్గామ్‌లో Kashmir Pahalgam  అమాయక పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడి తర్వాత భారత భద్రతా బలగాలు కాశ్మీర్‌లో ఉగ్రవాదులపై విస్తృతంగా ఆపరేషన్లు చేపట్టాయి. ఈ క్రమంలో శుక్రవారం బందిపొరా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా (LeT)కు చెందిన టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టారు. అతడే పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారి అని తెలుస్తుంది.

Altaf Lalli పహల్గామ్‌ దాడి సూత్రధారి ఖతం మిగిలింది వాల్లే

Altaf Lalli : పహల్గామ్‌ దాడి సూత్రధారి ఖతం.. మిగిలింది వాల్లే..!

Altaf Lalli బార్డర్ లో వేట మొదలైంది.. ఇక ఉగ్రవాదుల చావుకేకలే

ఇంటెలిజెన్స్ ఆధారంగా అల్తాఫ్ లల్లీ ఉన్న స్థావరాన్ని గుర్తించిన భద్రతా బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టాయి. ఎదురుకాల్పుల సమయంలో అల్తాఫ్ లల్లీ మృతి చెందగా, మరో ఉగ్రవాది గాయపడ్డాడు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా గాయపడినట్టు సమాచారం. గాయపడినవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పహల్గామ్ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు ఇది ఒక ప్రతీకార చర్యగా భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

పహల్గామ్ ఉగ్రదాడికి ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ అనే లష్కరే తోయిబా అనుబంధ సంస్థ బాధ్యత వహించిన సంగతి తెలిసిందే. హఫీజ్ సయీద్ నేతృత్వంలోని ఈ ఉగ్రవాద సంస్థ కాశ్మీర్‌లో విదేశీ ఉగ్రవాదులు, స్థానిక మద్దతుదారులతో కలిసి విధ్వంసానికి పాల్పడుతోంది. ప్రస్తుతం భద్రతా బలగాలు కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల జాడ కోసం తీవ్ర అన్వేషణ, నిర్మూలన చర్యలు చేపడుతున్నాయి. అల్తాఫ్ లల్లీ మృతితో ఉగ్రవాద శక్తుల పునాది కదిలిందని, ఇది భవిష్యత్తులో మరిన్ని విజయాలకు నాంది కావచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది