BRS : ఎన్నికలకు ఇంకా 25 రోజులే ఉండగా బీఆర్ఎస్‌కు భారీ షాక్.. ఎవ్వరూ ఊహించలేకపోయారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BRS : ఎన్నికలకు ఇంకా 25 రోజులే ఉండగా బీఆర్ఎస్‌కు భారీ షాక్.. ఎవ్వరూ ఊహించలేకపోయారు

 Authored By kranthi | The Telugu News | Updated on :5 November 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  భువనగిరిలో బీఆర్ఎస్ కు భారీ షాక్

  •  కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చేరికలు

  •  రోజురోజుకూ కాంగ్రెస్ కు పెరుగుతున్న బలం

BRS : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 25 రోజుల సమయం మాత్రమే ఉంది. వచ్చే నెల ఈ సమయం వరకు తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అది అధికార బీఆర్ఎస్ పార్టీయా లేక కాంగ్రెస్ పార్టీయా లేక ఏ పార్టీ అనేది పక్కన పెడితే.. వచ్చే నెల మాత్రం తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇక.. ఎన్నికలకు ఇంకా 25 రోజుల సమయమే ఉండటంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఏ నియోజకవర్గాన్ని కూడా వదలకుండా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో ఇంకా పార్టీల మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి నేతలు మారుతూనే ఉన్నారు. తమ రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం కొందరు ఇంకా పార్టీలు మారుతూనే ఉన్నారు. పార్టీలు కూడా అధికారంలోకి రావడం కోసం ఎలాంటి పనులు అయినా చేయడానికి సిద్ధపడుతున్నాయి. ఈనేపథ్యంలో ఏ పార్టీ కూడా చిన్న అవకాశాన్ని అయినా వదులుకోవడం లేదు.

అయితే కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు సొంత గూటికి తిరిగి రావాలని ఘర్ వాపసీ పేరుతో రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది పార్టీని వీడి వేరే పార్టీకి వెళ్లిన వాళ్లు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ కు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరిగాయి. తాజాగా భువనగిరి నియోజకవర్గంలోనూ చేరికలు పెరిగాయి. వలిగొండ, భువనగిరి, బీబీనగర్ మండలాల నుంచి భారీ సంఖ్యలో చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి ఒకేసారి వందల మంది చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.

BRS : కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు

ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ లో చేరడంతో కుంభం అనిల్ కుమార్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి