YS Jagan : జగన్ ఐడియాని కాపీ కొట్టిన మోడీ.. కేంద్రం ప్రకటన మీరే చూడండి..!
YS Jagan : ఏపీ ప్రభుత్వం నిర్ణయాలను కేంద్రం కూడా స్వాగతిస్తోంది. ఏపీలోని అభివృద్ధిని కేంద్రం మెచ్చుకుంటోంది అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. అవును.. సీపీఎస్ విషయంలో ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాన్నే కేంద్రం కూడా తీసుకోనుంది. అవును.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని చాలాకాలంగా పలు రాష్ట్రాల్లో డిమాండ్ వినిపిస్తోంది. దాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సానుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే జాతీయ పెన్షన్ విధానంలో పలు సవరణలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
సీపీఎస్ రద్దు విషయం చాలా రాష్ట్రాల్లో వినిపిస్తోంది. సీపీఎస్ రద్దుపై మన ఏపీలోనూ ఆందోళనలు వినిపించాయి. దీంతో ఏపీ ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. సీపీఎస్ రద్దు వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం ఉండదు.. అని కన్ఫమ్ చేసుకున్నాక కీలక ప్రతిపాదనపై ఆమోద ముద్ర వేసింది. సీపీఎస్ రద్దు చేసిన తర్వాత ఏపీలో రిటైర్ అయిన ఏ ఉద్యోగి అయినా తన చివరి జీతంలో నెలకు 50 శాతం పెన్షన్ అందేలా నిర్ణయం తీసుకుంది. దానికి ఏపీ కేబినేట్ కూడా ఆమోద ముద్ర వేసింది.అయితే.. తాజాగా జాతీయ పెన్షన్ పథకంలోనూ కేంద్రం సవరణల దిశగా అడుగులు వేస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా.. వేరే రాష్ట్రాల ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను సంతృప్తి పరిచేందుకు ఏపీలో అమలు చేస్తున్న విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
YS Jagan : జాతీయ పెన్షన్ పథకంలోనూ ఇలాంటి నిర్ణయాలే తీసుకోనున్న కేంద్రం
ఏపీలో చివరి జీతంలో 50 శాతం పెన్షన్ వచ్చేలా మార్చగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చివరి జీతంలో 40 శాతం నుంచి 45 వరకు పెన్షన్ వచ్చేలా చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగుల చివరి జీతంలో 38 శాతం మాత్రమే ఉద్యోగులకు పెన్షన్ గా అందుతోంది. కానీ.. 38 శాతం నుంచి 40 – 45 మధ్య పెన్షన్ ను అందివ్వాలని కేంద్రం భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని త్వరగా తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విధానం వర్తింపజేసేలా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. అలాగే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఇదే విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.