Central Govt Lakhpati didi : నేటి కాలంలో మహిళలు సైతం విద్య మరియు ఉన్నత స్థానాలతో పలు రకాల రంగాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటికే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాల ద్వారా అండగా నిలబడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో పథకంతో మహిళలకు శుభవార్త తీసుకువచ్చింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేరు లఖపతి దీదీ యోజన పథకం.
ఇక ఈ పథకం ద్వారా మహిళలకు శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి అవకాశాలను అందించే దిశగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా మహిళలందరూ అనేక రకాల వ్యాపారాలను ప్రారంభించి స్వయం ఉపాధి పొందే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పథకం ద్వారా వడ్డీ లేకుండా రూ.1 లక్ష నుండి రూ.5 లక్షల వరకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లఖపతి దీదీ యోజన పథకం ప్రధాన లక్ష్యం మహిళలు వారి గ్రామాలలో చిన్నచిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించడం. అంతేకాదు ఈ పథకం ద్వారా మహిళలు , LED బల్బుల తయారీ, డ్రోన్ ఆపరేషన్ – రిపేర్ , టైలరింగ్ మరియు వివిధ రంగాలలో శిక్షణ పొందగలుగుతారు.
సౌకర్యాలు…
స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు అవుతారు.
అలాగే ఈ పథకం ద్వారా పొదుపులు, చిన్న చిన్న రుణాలు, వృత్తి శిక్షణ ,వ్యవస్థాపక అభివృద్ధి మరియు భీమ కవరేజీ కోసం ఎంపికలు చేయబడతారు.
అవసరమైన పత్రాలు…
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మీరు కూడా ప్రయోజనాలను పొందాలంటే అర్హులైన మహిళలందరూ ఈ కింది పాత్రాలను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డు.
ఆదాయ ధ్రువీకరణ పత్రం.
నివాస ధ్రువీకరణ పత్రం.
బ్యాంకు ఖాతా వివరాలు.
మొబైల్ నెంబర్.
పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు మొదలైనవి.
ఎలా దరఖాస్తు చేయాలంటే…
ఈ పథకం ద్వారా మహిళలు ప్రయోజనాలు పొందాలంటే మీ సమీప ప్రాంతంలో గల అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి ఈ పథకం యొక్క సమాచారాన్ని తెలుసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.