Central Govt Lakhpati Didi : కేంద్ర ప్రభుత్వం లఖపతి దీదీ యోజన పథకం… వడ్డీ లేకుండా ఐదు లక్షల రుణాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Central Govt Lakhpati Didi  : కేంద్ర ప్రభుత్వం లఖపతి దీదీ యోజన పథకం… వడ్డీ లేకుండా ఐదు లక్షల రుణాలు…!

 Authored By ramu | The Telugu News | Updated on :5 April 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Central Govt Lakhpati didi  : కేంద్ర ప్రభుత్వం లఖపతి దీదీ యోజన పథకం...వడ్డీ లేకుండా ఐదు లక్షల రుణాలు...

  •  తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో పథకంతో మహిళలకు శుభవార్త తీసుకువచ్చింది...

  •  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మీరు కూడా ప్రయోజనాలను పొందాలంటే అర్హులైన మహిళలందరూ ఈ కింది పాత్రాలను కచ్చితంగా సమర్పించాలి..

Central Govt Lakhpati didi : నేటి కాలంలో మహిళలు సైతం విద్య మరియు ఉన్నత స్థానాలతో పలు రకాల రంగాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించడం కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటికే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాల ద్వారా అండగా నిలబడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో పథకంతో మహిళలకు శుభవార్త తీసుకువచ్చింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేరు లఖపతి దీదీ యోజన పథకం.

ఇక ఈ పథకం ద్వారా మహిళలకు శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి అవకాశాలను అందించే దిశగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక ఈ పథకం ద్వారా మహిళలందరూ అనేక రకాల వ్యాపారాలను ప్రారంభించి స్వయం ఉపాధి పొందే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ పథకం ద్వారా వడ్డీ లేకుండా రూ.1 లక్ష నుండి రూ.5 లక్షల వరకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Central Govt Lakhpati didi లఖపతి దీదీ యోజన పథకం.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లఖపతి దీదీ యోజన పథకం ప్రధాన లక్ష్యం మహిళలు వారి గ్రామాలలో చిన్నచిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించడం. అంతేకాదు ఈ పథకం ద్వారా మహిళలు , LED బల్బుల తయారీ, డ్రోన్ ఆపరేషన్ – రిపేర్ , టైలరింగ్ మరియు వివిధ రంగాలలో శిక్షణ పొందగలుగుతారు.

సౌకర్యాలు…

స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు అవుతారు.

అలాగే ఈ పథకం ద్వారా పొదుపులు, చిన్న చిన్న రుణాలు, వృత్తి శిక్షణ ,వ్యవస్థాపక అభివృద్ధి మరియు భీమ కవరేజీ కోసం ఎంపికలు చేయబడతారు.

అవసరమైన పత్రాలు…

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మీరు కూడా ప్రయోజనాలను పొందాలంటే అర్హులైన మహిళలందరూ ఈ కింది పాత్రాలను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది.

ఆధార్ కార్డు.

ఆదాయ ధ్రువీకరణ పత్రం.

నివాస ధ్రువీకరణ పత్రం.

బ్యాంకు ఖాతా వివరాలు.

మొబైల్ నెంబర్.

పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు మొదలైనవి.

ఎలా దరఖాస్తు చేయాలంటే…

ఈ పథకం ద్వారా మహిళలు ప్రయోజనాలు పొందాలంటే మీ సమీప ప్రాంతంలో గల అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి ఈ పథకం యొక్క సమాచారాన్ని తెలుసుకొని దరఖాస్తు చేసుకోవచ్చు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది