Central Govt : 2025లో జ‌నాభా లెక్క‌లు.. కొత్త నియోజ‌క‌వ‌ర్గాల కోసం ఎన్డీయే ఇలాంటి ప్లాన్ చేసిందా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Central Govt : 2025లో జ‌నాభా లెక్క‌లు.. కొత్త నియోజ‌క‌వ‌ర్గాల కోసం ఎన్డీయే ఇలాంటి ప్లాన్ చేసిందా ?

 Authored By ramu | The Telugu News | Updated on :29 October 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Central Govt : 2025లో జ‌నాభా లెక్క‌లు.. కొత్త నియోజ‌క‌వ‌ర్గాల కోసం ఎన్డీయే ఇలాంటి ప్లాన్ చేసిందా ?

Central Govt : జనగణనకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వ‌ర్గాల స‌మాచారం. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్​-ఎన్​పీఆర్​ను అప్డేట్ చేసే ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని టాక్ న‌డుస్తుంది. ఈ ప్రక్రియ 2026 వరకు జరగనుందని తెలుస్తోంది. 2026 ఏడాది చివర్లో పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.అయితే వచ్చే ఏడాది జరిగే జనగణనతో భవిష్యత్​ సెన్సస్​ సైకిల్స్​ మారే అవకాశం ఉంది. అంటే ఈ జనగణన 2025-2035 కాలానికే చేపడితే, వచ్చేసారి 2035-2045 కాలానికి లెక్కిస్తారు. ఇదిలా ఉండగా, కులగణనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.

Central Govt  విప‌క్షాల ప‌ట్టు..

2021లో జనాభా గణన జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ (కోవిడ్ 19) కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది. లోక్ సభ పునర్విభజనతో మహిళా రిజర్వేషన్ కూడా అమల్లోకి రానుంది.జనాభా లెక్కల తర్వాత లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2028 నాటికి ఈ పని పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నివేదిక ప్రకారం, వర్గాల ఆధారంగా జనాభా గణనను నిర్వహించే ఆలోచన కూడా ఉంది. ఆ తర్వాత లోక్‌సభ సీట్ల డీలిమిటేషన్‌కు మార్గం సుగమం అవుతుంది. ఇపుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జన గణన మీద పట్టుదలగా ఉంది. ఎందుకు అంటే దేశంలో ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ సీట్లను పునర్ వ్యవస్థీకరించి జనాభా ప్రాతిపదికన మరింతగా పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది.

Central Govt 2025లో జ‌నాభా లెక్క‌లు కొత్త నియోజ‌క‌వ‌ర్గాల కోసం ఎన్డీయే ఇలాంటి ప్లాన్ చేసిందా

Central Govt : 2025లో జ‌నాభా లెక్క‌లు.. కొత్త నియోజ‌క‌వ‌ర్గాల కోసం ఎన్డీయే ఇలాంటి ప్లాన్ చేసిందా ?

దీని వల్ల లోక్ సభ సీట్లు ఏకంగా 830 దాకా పెరగవచ్చు అని ఒక లెక్క ఉంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండగా నియోజకవర్గాల పునర్ విభజన జరిగితే కనుక కచ్చితంగా అది బీజేపీకే ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. తమకు బలం ఉన్న వాటిని విభజించుకుంటూ భారీగా రాజకీయ లబ్దికి తెర తీసే అవకాశం ఉంది అని విపక్షాలు అనుమానిస్తున్నాయి. జనగణన తర్వాత లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, అది 2028కి ముగుస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో విజయం సాధించినందున, తమ రాష్ట్రాలు లోక్‌సభ స్థానాలను కోల్పోయే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నేతలు తమ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది