Chandrababu : జగన్ పాలన భేష్ అంటూ ఒప్పుకున్న చంద్రబాబు ?
Chandrababu : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండో దశ వారాహి యాత్రలో ఏలూరు సభలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. కేంద్ర నిఘా వర్గాలు తమకు సమాచారం ఇచ్చినట్లు వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నట్లు పవన్ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు ఇంకా వైసీపీ పార్టీ ప్రతినిధులు మండిపడుతున్నారు. అయితే ఈ విషయంలో మాత్రం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వైఖరి చాలా తటస్థంగా ఉన్నట్లు ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్ వాలంటీర్ల వ్యవస్థను టీడీపీ కూడా సమర్ధించినట్లు.. ఇటీవల బాబు వ్యాఖ్యలు బట్టి తెలుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రారంభంలో చంద్రబాబు అది గోన్నే సంచులు మోసే ఉద్యోగం అంటూ.. హేళన చేస్తూ మాట్లాడారు.
కానీ వాలంటీర్ల వ్యవస్థ కరోనా సమయంలో కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు నేరుగా అందజేయడంతో పాటు ప్రజల సమస్యలను.. తీరుస్తూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఈ వాలంటీర్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు సైతం వాలంటీర్ల వ్యవస్థను తాము అధికారంలోకి వచ్చాక కూడా కొనసాగిస్తామన్న పరిస్థితి నెలకొంది. కాగా ఇటీవల పవన్ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యల విషయంలో చంద్రబాబుని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహం అని కానీ వాలంటీర్ల పౌర సేవకు పరిమితంగా రాజకీయ జోక్యం చేసుకుంటే కుదరదని పేర్కొన్నారు. ఇదే సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రజాసేవ వరకే వాలంటీర్ల సేవను పరిమితం చేస్తామని స్పష్టం చేశారు.
ఒక విధంగా చూసుకుంటే జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు కూడా సపోర్ట్ చేస్తున్నట్లు తాజా వ్యాఖ్యలు బట్టి అర్థమవుతుంది. ఒకప్పుడు చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు ఉండేవి. ఈ క్రమంలో లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందలంటే కచ్చితంగా.. జన్మభూమి కమిటీ లోని టీడీపీ నేతలు ఆమోదముద్ర వేస్తేనే సరి. కానీ జగన్ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ…అర్హతే ప్రామాణికంగా.. సంక్షేమం పథకాలను పార్టీలకు కులాల మతాలకు అతీతంగా అమలు చేస్తున్నారు. చాలా కట్టుదిట్టంగా వాలంటీర్ల వ్యవస్థతో సచివాలయ వ్యవస్థ అనుసంధానమై.. ప్రజా పాలనలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా వాలంటీర్లు.. తప్పులకు పాల్పడుతున్నారని చేస్తున్న వ్యాఖ్యలు నిజమైతే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఊరుకుంటుందా అనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న మరో ప్రశ్న.
సో దీన్ని బట్టి చూస్తే కేవలం వాలంటీర్లు జగన్ పాలనలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని.. పవన్ నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. అందువల్ల చంద్రబాబు సైతం తమ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించబోతున్నట్లు ఇటీవల మీడియా సమావేశంలో కూడా ఓ విధంగా చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ పాలన సమర్థవంతమైనదే అని చంద్రబాబు పరోక్షంగా ఒప్పుకున్నట్లు అర్థమవుతుంది.