Home » Andhra Pradesh » Chandrababu Bail Petition Rejected In Highcourt
andhra pradesh

Chandrababu : చంద్రబాబుకు మరో షాక్.. ఆ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: October 9, 2023, 12:44 pm
Advertisement

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఆయనకు మళ్లీ నిరాశే ఎదురైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్లు కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. ఏపీ హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టేసింది. మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. కనీసం ఒక్క కేసులో కూడా చంద్రబాబుకు బెయిల్ మంజూరు కాలేదు. ఇతర నిందితులకు ఈ కేసులో బెయిల్ వచ్చినా చంద్రబాబుకు మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.

Advertisement

మరోవైపు ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ పై తీర్పు త్వరలో వెలువడనుంది. లంచ్ తర్వాత జడ్జి.. సీఐడీ రిమాండ్ పై తీర్పు వెలువరించనున్నారు. కస్టడీ పిటిషన్, బెయిల్ పై ఏసీబీ కోర్టు తీర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక.. స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో బెయిల్ పై ఎలాంటి తీర్పు వస్తుందో అని అంతా ఎదురు చూస్తున్నారు.ఇన్నర్ రింగ్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్నారు. దీంతో తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.

Chandrababu : చంద్రబాబుకు మరో షాక్.. ఆ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత

Advertisement

అలాగే.. ఫైబర్ నెట్ లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఐడీ కేసు నమోదు చేసింది. అంగళ్లు ఘటనపై కూడా చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి