#image_title
BRS : తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ కు సమరం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరానికి అంతా సిద్ధం అవుతున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల కోసం రాజకీయాలు యూ టర్న్ తీసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ నేత ఎటువైపు వెళ్తాడో కూడా తెలియడం లేదు. నిజానికి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ కూడా ఈసారి అధికారం కోసం తెగ వ్యూహాలు రచిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే అధికార బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు చాలా మంది నేతలు బీఆర్ఎస్, బీజేపీలను వీడి కాంగ్రెస్ లో చేరారు. అధికార పార్టీ బీఆర్ఎస్ కే నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు.
అధికార పార్టీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మూడు నెలల ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా వేరే పార్టీ వైపు చూశారు. టికెట్ రాని ఆశావహులు వేరే పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు కారు తిగి హస్తం గూటికి చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కారు దిగి కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ నేతలు అయోమయానికి గురవుతున్నారు. తాజాగా మరో బీఆర్ఎస్ నేత కూడా కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన కీలక నేత వొడితల ప్రణవ్ బాబు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన ఎవరో కాదు.. మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు మనవడు. ఆ నేత బీఆర్ఎస్ ను వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ కు భారీ ఎదురుదెబ్బ తాకినట్టయింది.
#image_title
అయితే.. ప్రణవ్ బాబు హుజురాబాద్ కాంగ్రెస్ టికెట్ ఆశించినట్టు తెలుస్తోంది. కానీ.. హుజురాబాద్ టికెట్ ను కేసీఆర్ పాడి కౌశిక్ రెడ్డికి కేటాయించడంతో ప్రణవ్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీంతో తన తాత పని చేసిన కాంగ్రెస్ పార్టీలో తాజాగా చేరారు. ప్రణవ్ కు హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ప్రణవ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది.
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
This website uses cookies.