Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్త‌న తేడాగా ఉందే.. సైడ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడా..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: July 17, 2024, 8:00 pm
  •  Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్త‌న తేడాగా ఉందే.. సైడ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడా..!

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు దాటిపోయింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్‌పై సీఎం చంద్రబాబు సంత‌కాలు చేయ‌డం కూడా మ‌నం చూశాం. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారు, టికెట్లు దక్కని వారు, వలస నేతలు తదితరులకు న్యాయం చేస్తామని అధినేతలు హామీ ఇచ్చారు. వైసిపిని ఓడించడంలో… కూటమిని గెలిపించడంతో పవన్ కీలకంగా వ్యవహరించారు. ఇలా ఇంతకాలం సినిమాల్లో పవర్ స్టార్ గా నిరూపించుకున్న పవన్ ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాజకీయాల్లోనూ పవర్ ఫుల్ గా మారారు.

కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన పవన్ కు ప్రభుత్వంలోనూ కీలకంగా మారారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాతి స్థానం ఆయనకే దక్కింది…. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలు దక్కాయి. చంద్రబాబు కేబినెట్ లో పవన్ తో పాటు మరో ఇద్దరు జనసేన ఎమ్మెల్యేలకు చోటు దక్కింది. అయితు ఇటీవ‌ల చంద్ర‌బాబు త‌న‌ వెంట పవన్ ని తీసుకెళ్ల‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు ఒక్కరే వెళుతున్నారు. ఇదే ఇప్పుడు పలు అనుమానాలను రెకె్త్తిస్తోంది… పవన్ ను చంద్రబాబు పక్కనబెట్టేసారనే ప్రచారం ప్రారంభమయ్యింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ భేటీ అయ్యారు.

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్త‌న తేడాగా ఉందే.. సైడ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడా..!

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్త‌న తేడాగా ఉందే.. సైడ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడా..!

ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గోన్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ నుండి సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు పాల్గొన్నారు… డిప్యూటీ సీఎం పవన్ పాల్గొనలేదు. ఇది పవన్ ను చంద్రబాబు పక్కనబెట్టారంటూ ప్రచారానికి దారితీసింది. రీసెంట్‌గా ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు.. మంత్రుల్లో పయ్యావులు కేశవ్ తో పాటు మరికొందరిని వెంట తీసుకెళ్లారు కాని ప‌వ‌న్‌ని తీసుకెళ్లలేదు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇలా ప‌వ‌న్ లేకుండా చంద్ర‌బాబు ప‌లుచోట్లకి వెళుతుండ‌డం అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగేలా చేస్తుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp