Assembly Seats  : తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా కొత్త అసెంబ్లీ సీట్లు.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

 Authored By siddhu | The Telugu News | Updated on :25 March 2026,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Assembly Seats : తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా కొత్త అసెంబ్లీ సీట్లు.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Assembly Seats  : తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వేగంగా అడుగులు వేస్తోంది. 2014 రాష్ట్ర విభజన సమయంలోనే ఏపీలో 175 నుండి 225 కి, తెలంగాణలో 119 నుండి 153 కి సీట్లు పెంచాలని విభజన చట్టంలో రాసుకున్నారు. కానీ రకరకాల కారణాలతో ఈ పెంపుదల ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో  2029 ఎన్నికల నాటికే ఈ మార్పులు తీసుకురావాలని కేంద్రం గట్టి పట్టుదలతో ఉంది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో, ప్రస్తుతమున్న స్థానాల్లో 50 శాతం అదనంగా పెంచాలని యోచిస్తున్నారు. దీనివల్ల ఏపీలో అసెంబ్లీ స్థానాలు 263 కి, తెలంగాణలో 179 కి పెరిగే అవకాశం ఉంది.

Assembly Seats : తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా కొత్త అసెంబ్లీ సీట్లు.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Assembly Seats : తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా కొత్త అసెంబ్లీ సీట్లు.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Assembly Seats  : నియోజకవర్గాల కొత్త రూపురేఖలు

ఈ నియోజకవర్గాల పునర్విభజన వల్ల సామాన్య ఓటరుకు మరియు రాజకీయ నాయకులకు కూడా చాలా మార్పులు కనిపిస్తాయి. ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గంలో సగటున రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది ఓటర్లు ఉండగా, కొత్త విభజన తర్వాత ఆ సంఖ్య లక్షన్నరకి తగ్గుతుంది. భౌగోళికంగా చూస్తే ఇప్పుడు ఒక్కో నియోజకవర్గంలో నాలుగు నుండి ఐదు మండలాలు ఉంటే, భవిష్యత్తులో సగటున మూడు మండలాలకో ఎమ్మెల్యే చొప్పున ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ మరియు విశాఖపట్నం లాంటి నగరాల్లో నియోజకవర్గాల సంఖ్య దాదాపు రెట్టింపు అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడున్న 24 స్థానాలు 48 కి పెరిగే వీలుంది. అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా ఏపీలో 38 కి, తెలంగాణలో 25 కి పెరుగుతాయి.

మరో ముఖ్యమైన మార్పు మహిళా రిజర్వేషన్లు. 2029 నుండి చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ సీట్లు పెంచకుండా ఈ రిజర్వేషన్ ఇస్తే పురుష అభ్యర్థులకు అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే సీట్ల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల పురుషుల సీట్లకు ఇబ్బంది లేకుండానే మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం సాధ్యమవుతుంది. పెరిగే అదనపు సీట్లు మహిళా కోటా కిందకు వెళ్లే అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియ 2027 లో వచ్చే జనాభా లెక్కల ఆధారంగా లేదా 2011 లెక్కల ప్రకారం పూర్తి చేయాలని కేంద్రం చూస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలు తమకు అనుకూలంగా ఉండేలా నియోజకవర్గ సరిహద్దులను మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్పులు రాజకీయంగా చాలా కీలకం కానున్నాయి.

siddhu

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15 years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి