Chandrababu : అమిత్ షాని చంద్రబాబు బతిమాలుకుంది ఇదొక్కటే !
Chandrababu : చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో బిజీగా ఉన్న విషయం తెలుసు కదా. ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో మంతనాలు జరుపుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. త్వరలో ఏపీలోనూ ఎన్నికల హడావుడి మొదలు కానున్న నేపథ్యంలో చంద్రబాబు ఇప్పటి నుంచే కేంద్రాన్ని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఈ సంవత్సరం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నాయి. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
తెలంగాణలో ఎన్నికలు వచ్చే సంవత్సరం జనవరి 16న జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికలు ముగిసిన మూడు నెలల్లోనే ఏపీలోనూ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. తెలంగాణ ఎన్నికల సమయంలోనే ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయి అనే ప్రచారం ఉంది. నిజానికి జరగాల్సిన వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో. కానీ.. ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి ఏపీ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికలపై ప్రచారం జోరందుకుంది. సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా.. అనే విషయంపై క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతం ఉన్న ప్రచారం మేరకు.. ఈ సంవత్సరం అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారట.
Chandrababu : సీఎం జగన్ ముందస్తుకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా?
ఒకవేళ సీఎం జగన్ అక్టోబర్ లోపు అసెంబ్లీని రద్దు చేస్తే.. తెలంగాణ ఎన్నికల సమయం వరకు ఏపీలోనూ ఎన్నికలు రానున్నాయి. అందుకే ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. క్యాడర్ సిద్ధంగా ఉండటమే కాదు.. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకం అవుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. అందుకే ఆయన తాజాగా ఢిల్లీకి వెళ్లి హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. జేపీ నడ్డాతోనూ భేటీ అయ్యారు. ఏపీ రాజకీయాలపై ఇద్దరు నేతలతో ఆయన చర్చించినట్టు తెలుస్తోంది. తనతో కలిసి వస్తే..అంటే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తాను కొన్ని సీట్లను బీజేపీకి కేటాయిస్తా అని బేరం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. చంద్రబాబు ప్రతిపాదనలను బీజేపీ ఒప్పుకుంటుందో లేదో?