Chandrababu : నూత‌న సంవ‌త్స‌రంలో చంద్ర‌బాబు తీపి క‌బురు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : నూత‌న సంవ‌త్స‌రంలో చంద్ర‌బాబు తీపి క‌బురు…!

 Authored By ramu | The Telugu News | Updated on :3 January 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Chandrababu : నూత‌న సంవ‌త్స‌రంలో చంద్ర‌బాబు తీపి క‌బురు...!

Chandrababu  : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడు నెలల పాలన పూర్తి చేసుకోగా, వారు ఇచ్చిన ఎన్నిక‌ల హామీల‌ని ఒక్కొక్క‌టిగా తీర్చే ప‌నిలో ప‌డ్డారు. వైసీపీ హయాంలో మాదిరిగా కాకుండా మద్యం దుకాణాలలో నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయి. రోడ్లపై ఫోకస్ చేసిన కూటమి ప్రభుత్వం మరోవైపు ఏపీ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సైతం ఉక్కుపాదం మోపుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం కన్పిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయనేది ఉద్యోగుల ఆశగా ఉంది.

Chandrababu నూత‌న సంవ‌త్స‌రంలో చంద్ర‌బాబు తీపి క‌బురు

Chandrababu : నూత‌న సంవ‌త్స‌రంలో చంద్ర‌బాబు తీపి క‌బురు…!

Chandrababu  ఈ రోజు క్లారిటీ వ‌స్తుందా..

అందుకు తగ్గట్టే ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేయవచ్చని సమాచారం. ఉద్యోగులకు సంక్రాంతి పురస్కరించుకుని భారీ నజరానా ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. సంక్రాంతి పురస్కరించుకుని భారీ నజరానా ప్రకటించనున్నారు. సంక్రాంతికి ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. 11 గంటలకు జరగనున్న ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. వెలగపూడిలోని సచివాలయం 1వ బ్లాక్ లో మంత్రిమండలి సమావేశముంది. ఈ భేటీలో రెండు డీఏలు ప్రకటించవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలతో పాటు పీఆర్సీ, ఐఆర్‌పై కూడా చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు.

నెలకు రెండుసార్లు ఏపీ కేబినెట్ సమావేశం కావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆ మేరకు ఈ నెలలో మొదటి కేబినెట్ భేటీ జరగనుంది. సంక్రాంతి కానుకగా రెండు డీఏలు ప్రకటించవచ్చు. వెలగపూడిలోని సచివాలయం 1వ బ్లాక్ లో గురువారం నాడు ఏపీ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ రోజు టీడీపీ కార్యకర్తలు, నాయకులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశవ్యాప్తంగా సంతాప దినాలు కొనసాగుతున్నందున న్యూ ఇయర్ శుభాకాంక్షల కోసం తన వద్దకు బొకేలు, శాలువాలు తేవద్దని ఆయన సూచించారు. కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు కూడా వద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది