Chiranjeevi : పిఠాపురంలో ప్రచారాలు చేయనున్న చిరంజీవి… పవన్ కు 3 నష్టాలు 3 లాభాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : పిఠాపురంలో ప్రచారాలు చేయనున్న చిరంజీవి… పవన్ కు 3 నష్టాలు 3 లాభాలు…!

 Authored By ramu | The Telugu News | Updated on :28 April 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Chiranjeevi : పిఠాపురంలో ప్రచారాలు చేయనున్న చిరంజీవి... పవన్ కు 3 నష్టాలు 3 లాభాలు...!

Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా మెగా ఫ్యామిలీ ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ కూడా బాబాయ్ కోసం పార్టీ ప్రచారాల్లో పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి అడుగుపెడితే రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి కూడా ప్రచారాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కోసం పిఠాపురంలో చిరంజీవి అడుగుపెడితే మూడు నష్టాలు మూడు లాభాలు ఉన్నాయని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మరి ఆ లాభాలు నష్టాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వీటిలో ముందుగా ఒక నెగటివ్ ఒక పాజిటివ్ గురించి మాట్లాడుకున్నట్లయితే…

Chiranjeevi : నెగిటివ్ నెంబర్ 1..

ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ వర్మ మద్దతుతో గెలుస్తున్నారనే ప్రచారాలు సాగుతున్నాయి. అదేవిధంగా హైపర్ ఆది వంటి వారు కూడా తన గెలుపుకు కారణం అనే వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారాలు చేస్తే ఒకవేళ రేపు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మ చిరంజీవి వలనే పవన్ గెలిచాడు అనే నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Chiranjeevi పిఠాపురంలో ప్రచారాలు చేయనున్న చిరంజీవి పవన్ కు 3 నష్టాలు 3 లాభాలు

Chiranjeevi : పిఠాపురంలో ప్రచారాలు చేయనున్న చిరంజీవి… పవన్ కు 3 నష్టాలు 3 లాభాలు…!

Chiranjeevi : పాజిటివ్ నెంబర్ 1..

పిఠాపురం నియోజకవర్గం లో చిరంజీవి అడుగు పెడితే కచ్చితంగా సామాజిక వర్గపు ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ కు పడే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటివరకు పవన్ కు ఓటు వేయాలా లేదా జగన్ కు ఓటు వేయాలా అని ఆలోచిస్తున్నవారి ఓట్లన్నీ చిరంజీవి రాకతో పవన్ వైపు మల్లే అవకాశం ఉంటుంది.

Chiranjeevi : నెగిటివ్ నెంబర్ 2..

పిఠాపురం నియోజకవర్గం లో చిరంజీవి అడుగుపెడితే ఆయనకు సంబంధించినటువంటి గుడ్ విల్ అనేది పోయే అవకాశం ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిచిన పోతుంది. ఓడిపోతే మరింత ఎక్కువ పోతుంది. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీకి అమ్మేశావని , కేంద్ర మంత్రి పదవి కోసం ఇలా చేశావని రకరకాలుగా ఆరోపించేవారు ఇప్పుడు మళ్లీ రాజకీయాలకు ఎందుకు వచ్చావని చిరంజీవిని ప్రశ్నించే అవకాశం ఉంది.కాబట్టి రాజకీయ పార్టీల తరఫున ప్రచారాల కోసం చిరంజీవి దిగటం అనేది అతనికి ఉన్న గుడ్ విల్ ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది.

Chiranjeevi : పాజిటివ్ నెంబర్ 2…

యాంటీ జగన్ అనేటువంటి అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రజల్లోకి చిరంజీవి బాగా తీసుకెళ్లినవారవుతారు. అయితే ప్రస్తుతం జగన్ ను వ్యతిరేకిస్తున్నారు అనేది చాలా చోట్ల వినిపిస్తున్న మాట. ఇలాంటి సమయంలో యాంటీ జగన్ అనే విషయాన్ని ప్రజల్లో చాలావరకు చిరంజీవి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

Chiranjeevi : నెగిటివ్ నెంబర్ 3…

రాబోయే ఎన్నికల లో ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినప్పటికీ అధికారంలో జగన్ వస్తే మాత్రం జగన్ దృష్టిలో చిరంజీవి అనే వ్యక్తి బిగ్గెస్ట్ టార్గెట్ అవతారని చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ పై విపరీతమైన టార్గెట్ పడే అవకాశం కూడా ఉంటుంది. కూటమి గెలిస్తే ఓకే కానీ మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే మాత్రం చిరంజీవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా చిరంజీవి డీల్ చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా ఆ ప్రభావం సినీ ఇండస్ట్రీ పై పడే అవకాశం ఉంటుంది.

పాజిటివ్ నెంబర్ 3…

చిరంజీవి తమ్ముడు కోసం ప్రచారాలలో అడుగుపెట్టడం వలన మెగా
ఫ్యామిలీ అంతా కూడా ఒకటిగా ఉంటున్నారు అనేది చిరంజీవి ప్రూవ్ చేసుకోగలుగుతారు. పవన్ కళ్యాణ్ కోసం ఇప్పుడు చిరంజీవి ప్రచారాలు చేస్తే అన్నదమ్ములంతా ఎలాంటి విబేధాలు లేకుండా కలిసి ఉంటున్నారనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి ఇదొక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది