Chiranjeevi Modi : ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి సంబురాలని ఘనంగా జరుపుకున్నారు. ప్రధాని మోదీ కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. దిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన వేడుకల్లో మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవితో పాటు, పీవీ సింధూతో కలిసి ఆయన పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో టీవీ9 వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు, రంజిత్ రావు, టీవీ9 హోల్టైమ్ డైరెక్టర్ హేమంత్ శర్మ పాల్గొన్నారు. వారితోపాటు బీజేపీ అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ప్రముఖులు హాజరయ్యారు.
అయితే ప్రధాని, చిరంజీవి కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎన్నడూ లేనట్లు ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటుపలువురు ప్రముఖులు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. తనింట్లో జరిగే కార్యక్రమాలకు ఎవరెవరిని పిలవాలనేది పూర్తిగా కిషన్ ఇష్టమే అనటంలో సందేహం లేదు. అయితే ప్రధాని మోదీతో పాటు చిరంజీవి రావడం వారిద్దరు ఆప్యాయంగా పలకరించుకోవడం చర్చనీయాంశంగా మారంది. కార్యక్రమం ప్రారంభ సూచనగా ప్రధాని ఒక ఒత్తి వెలిగించి జ్యోతి ప్రజ్వలన చేయగా, రెండో ఒత్తిని చిరంజీవి వెలిగించాలని ప్రధాని సూచించారు.
కేంద్రంలో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాత్ర ఎంతో ఉందని ప్రధాని మోదీ విశ్వసిస్తున్నారు. అదే సమయంలో ప్రధాని మోదీకి పవన్ గట్టి మద్దతుదారు. దీంతో ప్రధాని మోదీతో మెగాస్టార్ కుటుంబం బాండింగ్ పెరిగిందని అంటున్నారు. దక్షిణాదిలో సొంతంగా బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో ఆ పార్టీ బలమైన స్థితిలో ఉండగా, తెలంగాణలో ఇప్పుడిప్పుడే ప్రధాన పార్టీగా ఎదుగుతోంది. మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ బంధం బలపరిచేలా అడుగులు వేస్తోందంటున్నారు. ఏపీలోని బలమైన సామాజిక నేపథ్యం ఉన్న చిరంజీవి సినీ గ్లామర్ కూడా తమ పార్టీకి కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.
Annadata Sukhi Bhava : ఎన్నికల హామీలపై ఏపీలోని కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే ప్రతి…
Waite Pepper Vs Black pepper : తెల్ల మిరియాలు నల్ల మిరియాలు అని రెండు రకాలు ఉంటాయి. విచిత్రం…
Mauni Amavasya 2025 : ఈ సంవత్సరం 2025 లో 29 జనవరి లో మౌని అమావాస్య Amavasya ఉంది.…
Warm Salt Water : పరగడుపున కొన్ని డ్రింక్స్ ని తీసుకుంటే మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. సాల్ట్ వాటర్…
Nursing Jobs : జనరల్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, మిడ్ వైఫరీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది.…
Shani : 2025 వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో గ్రహ నక్షత్ర పండుగ దృష్ట్యా ఇది ఎంతో ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది.…
Unilever : భారతదేశంలో హిందుస్తాన్ యూనిలీవర్‌గా పనిచేస్తున్న గ్లోబల్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) కంపెనీ అయిన యూనిలీవర్,…
Sreeleela : చుక్కల చీరలో చుక్కలు అందాలతో చుక్కలు చూపిస్తున్న శ్రీలీల.. ఫోటోస్..!
This website uses cookies.