Hospitals : కార్పొరేట్ ఆసుపత్రుల దందా.. ఇక వారిపని అయిపోయినట్టేనా ?
ప్రధానాంశాలు:
Hospitals : కార్పొరేట్ ఆసుపత్రుల దందా.. ఇక వారిపని అయిపోయినట్టేనా ?
Hospitals : ఆసుపత్రుల దందాలు ఏ రేంజ్‌లో పెరిగిపోతున్నాయో మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల దందాతో అమాయక జనాలు మోసపోతున్నారు. ఎన్ని కేసులు పెడుతున్నా కూడా వారు మారడం లేదు. నకిలీ బిల్లులను సమర్పించడం ద్వారా సీఎంఆర్ఎఫ్ నుంచి భారీగా నిధులను విత్ డ్రా చేసిన ఉదంతం సంచలనంగా మారడం మనం చూశాం. సీఎంఆర్ఎఫ్ కింద పేషెంట్లకు వైద్యం చేసినట్లు నకిలీ డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి, వాటి ద్వారా నిధులను విడుదల చేయించుకున్నాయి ఆయా ఆసుపత్రుల యాజమాన్యం.
Hospitals కూసం కదిలినట్టేనా..
అయితే సచివాలయ రెవెన్యూ మంత్రిత్వ శాఖ సెక్షన్ ఆఫీసర్ డీఎస్‌ఎన్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు ప్రకారం ఇందులో పలువురు రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్టు అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. విచారణను సీఐడీకి బదలాయించారు. రంగంలో దిగిన సీఐడీ అధికారులు తమ దర్యాప్తును ఉధృతం చేశారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పలు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యంపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. హైదరాబాద్‌లో- అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ కృష్ణ ఆసుపత్రి, జననీ ఆసుపత్రి, హిరణ్య ఆసుపత్రి, డెల్టా ఆసుపత్రి, శ్రీ రక్ష ఆసుపత్రి, ఎంఎంఎస్ ఆసుపత్రి, ఏడీఆర్ఎం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎంఎంవీ ఇందిరా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ సాయి తిరుమల ఆసుపత్రి ఉన్నాయి.
ఖమ్మంలో- శ్రీకర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, గ్లోబల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, డాక్టర్ జేఆర్ ప్రసాద్ ఆసుపత్రి, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, వైష్ణవి ఆసుపత్రి, న్యూ అమృత ఆసుపత్రి, మేఘాశ్రీ ఆసుపత్రి, ఆరెంజ్ ఉన్నాయి. ఇక నల్గొండ విషయానికి వస్తే – నవీనా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి- మిర్యాలగూడ, మహేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి- మిర్యాలగూడ, అమ్మ ఆసుపత్రి ఉన్నాయి. కరీంనగర్‌లో- సప్తగిరి ఆసుపత్రి- జమ్మికుంట, శ్రీసాయి ఆసుపత్రి- పెద్దపల్లి, వరంగల్‌లో రోహిణి మెడికేర్- హన్మకొండ, మహబూబాబాద్‌లో శ్రీ సంజీవిని, సిద్ధార్థ్ ఆసుపత్రిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది..