cm jagan : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
cm jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Ys Jagan బుధవారం భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సవరవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ మూలపేటలో పోర్టు శంకుస్థాపన చేయడం జరిగింది. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారుతుందని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకము కానున్నయని స్పష్టం చేశారు. అదేవిధంగా ఆదాన్ని డేటా సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖచిత్రమే మారబోతుందని పేర్కొన్నారు.
నేడు విమానాశ్రయం శంకుస్థాపన చేయటం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో కొంతమంది ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు హడావిడిగా టెంకాయలు కొట్టారు. మేమే శంకుస్థాపనలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఎన్జీటీలలో కేసులు వేసి అడ్డుపడ్డారు. కాని భగవంతుడు దయవల్ల అన్ని అడ్డంకులు దాటుకుని నేడు విమానాశ్రయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. రైతన్నల వల్లే ఈ ప్రాజెక్టు వచ్చింది. మెడికల్ టూరిజం, ఐటీ, ఇండస్ట్రీస్ కి కేంద్ర బిందువుగా భోగాపురం విమానాశ్రయం మారనుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. 2026లో మళ్లీ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి వస్తానని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల ఆశీస్సులు భగవంతుని దీవెన ఉన్నంతకాలం… ముందుకు పోతానని పేర్కొన్నారు. 24 నుంచి 30 నెలలలోనే ఈ విమానాశ్రయం పూర్తి చేయడం జరుగుతుందని జగన్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడో లేని రీతిలో రెండు రెండు రన్ వేలు… అందుబాటులోకి ఉండనున్నట్లు పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.