
cm kcr to lost in gajwel as mla
CM KCR : తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ.. మనం ఎక్కువగా మాట్లాడుకునే నియోజకవర్గాలు మాత్రం మూడే. అందులో ఒకటి గజ్వేల్. రెండోది సిద్దిపేట కాగా.. మూడోది సిరిసిల్ల. ఈ మూడు నియోజకవర్గాలను డెవలప్ చేసి ఇదిగో చూడండి తెలంగాణ ఎంతగా అభివృద్ధి చెందిందో అని చెప్పుకుంటారు మన పాలకులు. గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించేది సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కావడంతో గజ్వేల్ ను అభివృద్ధిలో ముందంజలో ఉంచాల్సిన బాధ్యత ఆయనదే. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనూ అభివృద్ధి జరిగింది. మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గంలోనూ అభివృద్ధి బాగానే జరిగింది. అయితే.. ఈ మూడు నియోజకవర్గాలు అభివృద్ధి జరిగితే చాలా.. మిగితా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి.. ఆ మూడు నియోజకవర్గాలు అభివృద్ధి చెందితే రాష్ట్రమంతా అభివృద్ధి జరిగినట్టేనా అని ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పుడు ఇతర నియోజకవర్గాలపై కూడా దృష్టి సారించారు పాలకులు.
అయినా కూడా జరగాల్సిన తప్పు జరిగిపోయింది. కేవలం ఆ మూడు నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకొని రాష్ట్రమంతా అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తామని ఓవైపు ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇదంతా పక్కన పెడితే.. ఇంత అభివృద్ధి చేసిన గజ్వేల్ లోనూ కేసీఆర్ పై వ్యతిరేకత వస్తోంది. దానికి కారణం ఏంటి అని లోతుగా అధ్యయనం చేస్తే.. అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఈసారి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో ఎందుకు పోటీ చేస్తున్నారు. గజ్వేల్ లో ఎలాగూ భారీ మెజారిటీతో గెలుస్తారు కదా అనే అనుమానం అందరికీ వచ్చింది. కానీ.. ఈసారి గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోయే చాన్స్ ఉందని తెలిసే కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు అని అంటున్నారు.
గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపై ఒకసారి విశ్లేషిద్దాం. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కోసం 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను నింపే ప్రయత్నం చేశారు. దాని కోసమే 15 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం ములుగులో కొండ పోచమ్మ సాగర్ నిర్మాణాన్ని చేపట్టింది. అయితే.. కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ కోసం చాలామంది దగ్గర భూములు తీసుకున్నారు. దీంతో చాలామంది ప్రజలు, రైతులు రోడ్డున పడ్డారు. భూనిర్వాసితులకు కనీసం నష్టపరిహారం కూడా సరిగ్గా ఇవ్వలేదు. వాళ్లకు అప్పుడు మార్కెట్ లో ఉన్న ధర కంటే కూడా తక్కువ ధర ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. అక్కడే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అందుకే.. కేసీఆర్ కాదు కదా.. బీఆర్ఎస్ పార్టీ తరుపున ఎవరు పోటీ చేసినా దారుణంగా ఓడిస్తామని ప్రజలు బీష్మించుకు కూర్చున్నారు. అసలు తమ గ్రామాల్లోకి కూడా నేతలను రానివ్వడం లేదు. ప్రచారం చేయనీయడం లేదు. అవసరానికి మించి ప్రజల దగ్గర్నుంచి భూములు సేకరించి ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారని.. తమకు నష్టపరిహారం కూడా సరిగ్గా ఇవ్వలేదని కేసీఆర్ పై మండిపడుతున్నారు. అందుకే ఈసారి గజ్వేల్ లో కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలే చాన్స్ ఉంది. అందుకే మరో ఆప్షన్ గా కేసీఆర్.. కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.