prashant kishore good news to revanth reddy
Prashant Kishore – Revanth Reddy : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈనేపథ్యంలో తెలంగాణలో ఈసారి ఎలాగైనా గెలవాలన్న కసిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉన్నాయి. ఈసారి బీజేపీ పార్టీ రేసులో ఉన్నా ఆ పార్టీది మళ్లీ మూడో స్థానమే. ఇప్పుడు మొదటి ప్లేస్ కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. అయితే.. ఈసారి నువ్వా నేనా అనే విధంగా ఫైట్ చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్.. తమకు తామే మా పార్టీ గెలుస్తుందంటే మా పార్టీ గెలుస్తుందంటూ గొప్పలు చెప్పుకుంటున్నాయి. అసలు ఏ పార్టీ గెలుస్తుంది.. ఏ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు అనేది పక్కన పెడితే ఈ 5 రోజులు ప్రచారాన్ని మాత్రం ముమ్మరం చేస్తున్నాయి. ఈ 5 రోజులు ఏమాత్రం విరామం లేకుండా ప్రధాన పార్టీలన్నీ తెగ కష్టపడి మరీ ప్రచారం చేస్తున్నాయి. అయితే.. ఈ సారి ఎలాగైనా గెలుస్తామన్న ఊపులో కాంగ్రెస్ ఉండగా.. ఈసారి ఓటమి తప్పదని బీఆర్ఎస్ ముందే అంచనా వేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితులు, పలు సర్వేలు చూస్తూ అదే అనిపిస్తోంది.
మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఇటీవల సీఎం కేసీఆర్ తో భేటీ అయినప్పుడు బీఆర్ఎస్ పరిస్థితిని కేసీఆర్ కు వివరించారు. క్షేత్రస్థాయిలో సర్వే చేయించి ఆ రిపోర్ట్ ను కేసీఆర్ కు అందించారట. ఈసారి పోటీ టఫ్ గానే ఉందని చెప్పారట. తెలంగాణలో మౌత్ టాక్ చూస్తే కాంగ్రెస్ దే గెలుపు అని తెలుస్తోంది. రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుండటంతో వెంటనే ప్రశాంత్ కిషోర్ ను పిలిపించారు సీఎం కేసీఆర్. ప్రశాంత్ కిషోర్ ను తన పార్టీ కోసం ఎన్నికల వరకు పనిచేయాలని కేసీఆర్ కోరారట. కానీ.. ప్రశాంత్ కిషోర్ మాత్రం తెలంగాణలో ప్రజలు ప్రస్తుతం బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నారని.. కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని కేసీఆర్ కు వివరించారట. కనీసం వారం రోజులు అయినా వ్యూహకర్తగా వ్యవహరించాలని అడిగినా కూడా పీకే తన నిస్సహాయతను వ్యక్త పరిచారట.
క్షేత్రస్థాయిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. అసలు పార్టీ మీదనే తీవ్ర స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఈసమయంలో సభల్లో మేనిఫెస్టో గురించి కూడా చెప్పకపోవడమే మంచిదని కేసీఆర్ కు పీకే సూచించారట. అందుకే కేసీఆర్ తన సభల్లో కాంగ్రెస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు కానీ.. బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి మాట్లాడటం లేదు. కాంగ్రెస్ గెలిస్తే 24 గంటల కరెంట్ రాదు.. నీళ్లు రావు.. అవి రావు.. ఇవి రావు అంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. పీకే.. కేసీఆర్ తో భేటీ అయి.. కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పడంతో అటు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయినట్టు తెలుస్తోంది.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.