Congress Party : పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారెంటీస్.. కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్..!
ప్రధానాంశాలు:
Congress Party : పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారెంటీస్.. కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్..!
Congress Party : దేశంలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టో కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. దేశంలో ఈ రెండే ప్రధాన పార్టీలు అని మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ ముందుగా తన మేనిఫెస్టోను ప్రకటించింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో దీన్ని రిలీజ్ చేశారు. ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీస్’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందులో చూసుకుంటే కార్మిక న్యాయం, రైతు న్యాయం, యువన్యాయం, మహిళా న్యాయం పేరుతో హామీ ఇచ్చింది.
Congress Party పచ్చీస్ గ్యారెంటీస్ కాంగ్రెస్ మేనిఫెస్టో
కర్నాటక, తెలంగాణ ఎన్నికల్లో అనుసరించిన విధానాలనే జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టాలని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన చేసింది. ఇందులో ప్రధానంగా నిరుద్యోగం, ధరల తగ్గింపు, పేదల ఆర్థిక వృద్ధి, మహిళల మక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది కాంగ్రెస్. రేపు జైపూర్, హైదరాబాద్‌లలో బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ప్రజల ముందు ప్రకటించనున్నారు. ఈ సభల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రస్తుత అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ మాట్లాడుతారు.ఇంతకీ మేనిఫెస్టోలో కీలక అంశాలను చూసుకుంటే.. కేంద్ర ప్రభుత్వంలో 30లక్షల ఉద్యోగాలు, నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఏడాదికి రూ.లక్ష, కుల గణన, కనీస మద్దతు ధరకోసం ఎమ్ ఎస్ పికి చట్టం తీసుకురావడంతో పాటు ఉపాధి కూలీని రూ.400లకు పెంచడం, దాంతో పాటు ఇతర ఏజెన్సీలు, మార్పులు ఉంటాయని ఇందులో ప్రకటించారు.
మేనిఫెస్టో పార్టీ ఐదు న్యాయ సూత్రాల ఆధారంగా పని చేస్తుందని మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం తెలిపారు. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీస్ పేరుతో దీన్ని విడుదల చేశారు. అన్ని రకాల వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని దీన్ని విడుదల చేసినట్టు చెబుతున్నారు. ఇక తెలంగాణలో తుక్కుగూడలో నిర్వహించే సభలో కచ్చితంగా దీనిపై పూర్తి ప్రసంగం ఇస్తారు. అన్ని పార్టల కంటే ముందే మేనిఫెస్టోను ప్రకటించడం వల్ల బాగా ప్రజల్లోకి వెళ్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. చూడాలి మరి ప్రజలు ఈ మేనిఫెస్టోను ఎంత వరకు నమ్ముతారో.