Categories: Newspolitics

Gas Cylinder : సామాన్యుడు బ్రతికే రోజులు పోయినట్లేనా..?

Gas Cylinder : మోడీ సర్కారు మరోసారి సామాన్య ప్రజలపై ధరల భారం మోపింది. వంటగ్యాస్ ధరను ఒక్కసారిగా రూ.50 పెంచుతూ కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటించింది. ఈ పెంపు ఉజ్వల యోజన పథకం కింద సబ్సిడీతో లభించే గ్యాస్ సిలిండర్లపైనా వర్తించనుంది. పెరిగిన ధరలు మంగళవారం తెల్లవారుజాము నుంచే అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు వంటగ్యాస్ ధరను పెంచడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Gas Cylinder : సామాన్యుడు బ్రతికే రోజులు పోయినట్లేనా..?

Gas Cylinder వంటగ్యాస్ వినియోగదారుల పై మోడీ బాదుడు

ఈ ధరల పెంపు నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో ఈ విధంగా ధరలు పెంచడాన్ని ఆయన విమర్శించారు. క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 60 డాలర్ల కంటే దిగువకు చేరగా, రష్యా యురాల్స్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 50 డాలర్ల కంటే తక్కువగా ఉండటం మనం గమనించాల్సిన విషయం అని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పడిపోతే, దాని లాభాలను ప్రజలకు అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.

Also Read ===> Success Story : కూతురి ఆనందం కోసం స్టాల్.. నెల‌కు ల‌క్ష‌లు సంపాదిస్తున్న తండ్రి

పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండటం వలన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అంశమని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే రవాణా, ఉత్పత్తి ఖర్చులు తగ్గి, ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదగగలదని అన్నారు. ప్రభుత్వం మాత్రం ప్రజల భారం తాకట్టు పెట్టి, అర్ధరాత్రి పెంపులు ప్రకటించడం అసమంజసమని విమర్శించారు. ఈ విషయంపై ఆయన కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై సామాన్యులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

1 week ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

1 week ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

1 week ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

1 week ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

1 week ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

2 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

2 weeks ago