Success Story : కూతురి ఆనందం కోసం స్టాల్.. నెలకు లక్షలు సంపాదిస్తున్న తండ్రి
ప్రధానాంశాలు:
Success Story : కూతురి ఆనందం కోసం స్టాల్.. నెలకు లక్షలు సంపాదిస్తున్న తండ్రి
Success Story : కొన్ని సక్సెస్ స్టోరీలు చాలా మందికి ఆదర్శవంతంగా నిలుస్తాయి. కూతురి ఆనందం కోసం ఒక స్టాల్ ప్రారంభిస్తే తండ్రి సంపాదన లక్షలు దాటింది. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన శ్వేత రాజు అండ్ ఆమె భర్త వెంకట్ రాజు ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. 2021 సంవత్సరంలో తన కుమార్తె మహతి సంతోషం కోసం ఫోర్ట్ గ్రీన్ పార్క్‌లోని గ్రీన్ మార్కెట్ దగ్గర నిమ్మరసం అలాగే మసాలా దోసెల స్టాల్‌ను స్టార్ట్ చేశాడు.

Success Story : కూతురి ఆనందం కోసం స్టాల్.. నెలకు లక్షలు సంపాదిస్తున్న తండ్రి
Success Story అదృష్టం అంటే వీరిదే..
జనాలకు ఆమె వేసే దోసె చాలా నచ్చింది. జనాలు దోసె తిన్న వెంటనే అందరికి బాగా నచ్చింది. రాజు కుటుంబం దోసెలకు ఫెమస్ అయ్యింది. డిమాండ్ పెరగడంతో అతను ఒక నెల తర్వాత పార్కులో గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేసి, అతను అక్కడే దోసెలు తయారు చేయడం ప్రారంభించాడు. దీని కారణంగా వాళ్ళ దోసెలకు డిమాండ్ మరింత పెరిగింది. సెప్టెంబర్ 2021 నాటికి ప్రతి శనివారం వందలాది మంది కస్టమర్లు లైన్లలో నిలబడటం మొదలు పెట్టారు. దోసె ధర అప్పుడు $10 అంటే మన ఇండియా రూపాయి ప్రకారం రూ.855.
రాజు దంపతులు దీనిని ఒక అవకాశంగా భావించి, పాప్-అప్ సర్వీస్ కూడా అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు దోసె ధర $1 అంటే రూ.85. వీరు వంటల కోసం ముడి పదార్థాల కోసం వారానికి $700 ఖర్చు చేస్తారు. అంతే కాకుండా నలుగురు పార్ట్ టైమ్ ఉద్యోగులకు కూడా జీతాలు ఇస్తున్నారు. వీటితో పాటు ప్రతి నెలా $3,800 రెంట్ కూడా కట్టాలి. ఇవన్నీపోగా వీళ్ళ ఆదాయం నెలకు $15,000. కష్టపడి పనిచేయడం పక్కన పెడితే, వీళ్ళ ఫుడ్స్ ప్రజలతో కనెక్ట్ అయినందుకు సంతోషంగా ఉన్నారు.