Daughter In law : భర్త బయటకు వెళ్ళగానే మామతో కోడలు రంకు యవ్వారం.. స‌డెన్‌గా కూతురు ఎంట్రీ.. చివ‌ర‌కు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Daughter In law : భర్త బయటకు వెళ్ళగానే మామతో  కోడలు రంకు యవ్వారం.. స‌డెన్‌గా కూతురు ఎంట్రీ.. చివ‌ర‌కు..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 July 2025,1:20 pm

ప్రధానాంశాలు:

  •  మామతో కోడలు అక్రమ సంబంధం.. అడ్డుగా ఉందని కూతుర్ని చంపేసింది..!

  •  Daughter In law : భర్త బయటకు వెళ్ళగానే మామతో  కోడలు రంకు యవ్వారం.. స‌డెన్‌గా కూతురు ఎంట్రీ.. చివ‌ర‌కు..!

Daughter In law : ఇటీవల వివాహేతర సంబంధాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. వావివరుసలు మరచిపోయి..సమాజాన్ని తలదించుకునేలా కొంతమంది ఆడవారు వ్యవహరిస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని కన్న బిడ్డలను, కట్టుకున్న భర్తలను చంపేస్తున్నారు. తాజాగా ఈ తరహా ఘటనే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ట్రాలీ డ్రైవర్ హరికృష్ణ భార్య సునీత, తన మామ నరసింహారావుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధం వలన వారు చేసిన పాపం అమాయక చిన్నారి ప్రాణాన్ని తీసింది. 11 ఏళ్ల పాప ఏకాంతంగా గడుపుతుండగా చూసిందని కూతుర్నే చంపేసింది.

Daughter In law భర్త బయటకు వెళ్ళగానే మామతో కోడలు రంకు యవ్వారం స‌డెన్‌గా కూతురు ఎంట్రీ చివ‌ర‌కు

Daughter In law : భర్త బయటకు వెళ్ళగానే మామతో  కోడలు రంకు యవ్వారం.. స‌డెన్‌గా కూతురు ఎంట్రీ.. చివ‌ర‌కు..!

Daughter In law : మామతో ఏకాంతంగా గడుపుతుండగా కూతురి ఎంట్రీ.. ఎక్కడ భర్తకు చెపుతుందో అని దారుణానికి ఒడిగట్టింది

మొదటగా బాధిత తల్లిదండ్రుల కన్నీళ్ల వెనుక దాగిన నేరాన్ని అనుమానించిన పోలీసులు, మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. సునీతను ప్రైమ్ సస్పెక్ట్‌గా అరెస్టు చేసి, సుతిమెత్తగా కూపీలాగారు. చివరికి, నిజం ఒప్పుకుంది. తన కూతురిని తానే చంపానని ఆమె అంగీకరించగా, నరసింహారావు పాత్ర కూడా బయటపడింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసును కోర్టుకు అప్పగించగా, తాజాగా సత్తుపల్లి ఆరో అడిషనల్ జిల్లా జడ్జి శ్రీనివాస్ ఇద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.

ఈ ఘటన సమాజానికి చెంపపెట్టులాంటి గుణపాఠం. ఒక తల్లి, తండ్రిగా ఉండాల్సిన వారు తమ కూతురిని కాపాడాల్సిన సమయంలో, ఆమె ప్రాణాలకే శత్రువులై మారారు. ఇది ఒక్క కుటుంబానికి చెందిన విషాదగాథ కాదు – దేశవ్యాప్తంగా ఇలాంటి అనేక కుటుంబాలు, ఈ సంబంధాల వలన శోధనలో ఉన్నాయంటే ఆలోచించాల్సిన సమయం ఇది. బంధాలు, బాధ్యతలు, నైతికతలను నిలబెట్టుకోవడంలో విఫలమైతే, కుటుంబాలే కాదు – సమాజం మొత్తమే ఛిన్నాభిన్నం అవుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది