Delhi Railway Station : ఢిల్లీ తొక్కిలాసటకి కారణం ఇదేనా.. ఎంత మంది మృతి చెందారంటే..!
ప్రధానాంశాలు:
Delhi Railway Station : ఢిల్లీ తొక్కిలాసటకి కారణం ఇదేనా.. ఎంత మంది మృతి చెందారంటే..!
Delhi Railway Station : ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న Maha Kumbh Mela మహా కుంభమేళాకు వెళ్తూ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది చనిపోయిన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో 14 మంది మహిళలు.. నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. వీరే కాకుండా మరో 30 మంది ప్రయాణికులు కూడా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Delhi Railway Station : ఢిల్లీ తొక్కిలాసటకి కారణం ఇదేనా.. ఎంత మంది మృతి చెందారంటే..!
Delhi Railway Station ఎలా చనిపోయారంటే..
మృతులంతా ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించినట్లు తెలిపారు.మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడానికి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ గొప్పలుపోయింది. ఇందులో భాగంగా గంటకు 1500 జనరల్ టికెట్లు విక్రయిస్తున్నామంటూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకటించారు. జనరల్ టికెట్ల కోసం జనం ఎగబడ్డారు. అవసరానికి మించి టికెట్లను విక్రయించడం, ఆ రద్దీకి తగినట్లు రైళ్లు సకాలంలో నడపకపోవడం తొక్కిసలాటకు దారితీసింది. టికెట్లు కొన్నవారు ప్లాట్‌ఫామ్‌పైనా, మెట్లపైనా నిలబడ్డారు.
మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున రైల్వేశాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులకు రూ.2.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు తెలిపింది. స్వల్పంగా గాయాలు అయిన వారికి రూ.లక్ష చొప్పున సహాయం చేయనున్నట్లు వెల్లడించింది.